Site icon HashtagU Telugu

Rajamouli : ‘కల్కి’ మూవీ రాజమౌళి ఫొటోలు లీక్.. ఈ లుక్స్ లో రాజమౌళి విలన్ గా చేస్తే..

Rajamouli Kalki Movie Look Photos Leaked goes Viral in Social Media Looks like Villain

Rajamouli

Rajamouli : తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ ని పాన్ ఇండియాకు, ప్రపంచమంతా తెలిసేలా చేసింది రాజమౌళి అనడంలో సందేహం లేదు. బాహుబలి సినిమాతో ఇండియాను శాసించి, RRR సినిమాతో ఆస్కార్ తెప్పించి వరల్డ్ బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు అనిపించుకున్నాడు. ప్రపంచమంతా రాజమౌళిని పొగిడేలా చేసుకున్నాడు తన సినిమాలతో. తన నెక్స్ట్ సినిమా కోసం ఇండియన్ ప్రేక్షకులే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు.

అయితే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న గెస్ట్ రోల్స్ చేస్తూనే ఉంటారు. అలా రాజమౌళి కూడా తన సినిమాల్లోనే పలుమార్లు కనపడ్డాడు. ఇటివల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో చిన్న రోల్ కూడా చేసాడు రాజమౌళి. ఓ సరికొత్త లుక్ లో రాజమౌళి కనపడి ప్రేక్షకులని మెప్పించాడు. కల్కి లో రాజమౌళి క్యారెక్టర్ బాగానే పేలింది.

అయితే తాజాగా కల్కి సినిమాలో రాజమౌళి గెటప్ ఫొటోలు లీక్ అయ్యాయి. కల్కి షూటింగ్ సమయంలో ఆ గెటప్ లోకి రెడీ అయిన తర్వాత రాజమౌళి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూస్తుంటే రాజమౌళి అచ్చం విలన్ లానే ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు. లుక్ కూడా అదిరిపోయిందని, భయపెట్టేలా ఉందని, విలన్ క్యారెక్టర్ కి ఈ లుక్ లో రాజమౌళి బాగా సెట్ అవుతాడని పలువురు కామెంట్స్ చేస్తున్నాడు. నిజంగానే ఈ లుక్ లో రాజమౌళి విలన్ క్యారెక్టర్ చేస్తే అదిరిపోద్దేమో. ఎవరైనా డైరెక్టర్స్ ఈ డైరెక్టర్ కి విలన్ ఛాన్స్ ఇస్తే బాగుండు.

 

Also Read : Kiran Abbavaram : దీపావళి బరిలో కిరణ్ అబ్బవరం ఫస్ట్ పాన్ ఇండియా సినిమా.. కిరణ్ ధైర్యం ఏంటి..?