దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కి అంత ఫిదా అయితే..ఆయన మాత్రం ఫస్ట్ టైం ఓ హీరోయిన్ కు ఫిదా అయ్యారట..ఆ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. మ్యాథ్యూ థామస్, నస్లేన్ కె. గపూర్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ప్రేమలు (Premalu). గిరీశ్ ఎ.డి. డైరెక్ట్ గా చేయగా.. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగు లో కూడా ఈ సినిమా కు సూపర్ హిట్ టాక్ రావడం తో ..మేకర్స్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ సక్సెస్ మీట్ కు రాజమౌళి , దర్శకులు అనిల్ రావిపూడి, అనుదీప్ కేవీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ..”కీరవాణి అన్నయ్య నీలగిరి చిత్రానికి వర్క్ చేస్తున్న సమయంలో మలయాళ పదం ఎందమాషే పదానికి అర్థం తెలుసుకున్నాను. నేను శాంతినివాసం సీరియల్ కు దర్శకత్వం వహించేటప్పుడు రచయిత పృథ్వీతేజను మాషే అని పిలిచే వాడిని. కొంతకాలం తర్వాత దాని అర్థం ఏంటని ఆయన అడిగారు. మాషే అంటే బాస్ అని చెప్పాను. దీంతో ఆయన నవ్వారు. అలా మలయాళంతో నాకు పరిచయం ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join.
మా సిస్టర్స్ కూడా ఇద్దరు కేరళకు చెందిన వారినే పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల్లో ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలను నేను పెద్దగా ఇష్టపడను. యాక్షన్, ఫైట్లు అంటేనే ఇష్టం. ప్రేమలు చిత్రాన్ని ఇక్కడ కార్తికేయ రిలీజ్ చేసినప్పుడు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. ఇంట్రెస్ట్ లేకుండానే థియేటర్ వెళ్లి సినిమా చూశాను. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ఇది థియేటర్లలోనే చూడాలి. అసూయ, బాధతో చెబుతున్నాను. మలయాళీ యాక్టర్స్ అంతా చక్కగా నటిస్తారు. గిరిజ (గీతాంజలి ఫేమ్), సాయి పల్లవిలా ఈ సినిమా హీరోయిన్ మమిత కూడా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది” అని ప్రశంసలు కురిపించారు. రాజమౌళి నోటి వెంట ఫిదా అయ్యాను అనే మాట చాల అరుదు..అది కూడా హీరోయిన్ యాక్టింగ్ కు ఫిదా అయ్యాను అని చెప్పేసరికి సదరు హీరోయిన్ కు మాటలు రాలేదు. ప్రస్తుతం రాజమౌళి..మహేష్ మూవీ లో బిజీ గా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకురానున్నారు.
Read Also : Fake Cancer Drugs : రూ.100 ఇంజెక్షన్ రూ.3 లక్షలకు సేల్.. ఫేక్ మెడిసిన్ మాఫియా గుట్టురట్టు