Rajamouli : నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర వాఖ్యలు చేసిన జక్కన్న.. అతన్ని రిలీజ్ కి జపాన్ కి తీసుకొస్తానంటూ?

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 12:50 PM IST

ఆర్ఆర్ఆర్.. సినిమా సక్సెస్ అవడంతో రాజమౌళికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. అంతే కాకుండా ఇతర దేశాల్లో కూడా రాజమౌళికి ఈ సినిమా తర్వాత భారీగా అభిమానులు ఏర్పడ్డారు. మరి ముఖ్యంగా జపాన్ అమెరికా లాంటి దేశాల్లో జక్కన్నకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క రాజమౌళిని మాత్రమే కాకుండా రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లను కూడా ఇతర దేశాల్లో గ్రాండ్ గా ట్రీట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గతంలో జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేయగా ఈ సినిమాకు అక్కడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఆ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకున్న మూవీ మేకర్స్ తాజాగా జపాన్ లో ఈ మూవీని మరొకసారి రీ రిలీజ్ అవ్వడంతో రాజమౌళి అక్కడికి వెళ్లారు. రాజమౌళికి అక్కడ గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎంతోమంది అభిమానులు రాజమౌళిని కలవడానికి వచ్చారు. అక్కడి అభిమానులు రాజమౌళికి చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దీనిపై రాజమౌళి ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా ఎమోషనల్ పోస్ట్స్ చేసారు. ఇక రీ రిలీజ్ లో, అది కూడా జపాన్ లో ఆర్ఆర్ఆర్ థియేటర్స్ అన్ని ఫుల్ అయ్యాయి. సినిమా అనంతరం రాజమౌళి అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా గురించి కూడా మాట్లాడాడు.

రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం అభిమానులతో పాటు, సినీ ప్రేమికులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా జపాన్ లో రాజమౌళి మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా రైటింగ్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కాస్టింగ్ ఎవర్ని ఫైనల్ చేయలేదు ఒక్క మెయిన్ హీరో తప్ప. అతని పేరు మహేష్ బాబు, చాలా అందంగా ఉంటాడు, తెలుగు యాక్టర్. మీకు కూడా తెలిసే ఉంటుంది. త్వరలోనే సినిమా మొదలవ్వనుంది. సినిమా రిలీజ్ టైంకి అతన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను అని అన్నారు. దీంతో రాజమౌళి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.