Site icon HashtagU Telugu

Rajamouli : చరణ్ కోసం దర్శక ధీరుడు..!

Rajamouli guest for Ram Charan Game Changer Trailer Release Event

Rajamouli guest for Ram Charan Game Changer Trailer Release Event

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినీమలో సాంగ్స్ కూడా అదిరిపోయాయి. సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్ సినిమా జనవరి గురు వారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

ఈ ఈవెంట్ కి గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళిని ఫిక్స్ చేశారు. రాజమౌళి వస్తున్నాడని తెలిసి మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. చరణ్ తో మగధీర, RRR రెండు సినిమాలు చేశాడు రాజమౌళి. ఇక శంకర్ అంటే కూడా జక్కన్నకు ఇష్టం. అందుకే ఇటు చరణ్ కోసం అటు శంకర్ కోసం ఈ ఈవెంట్ కి వస్తున్నాడని తెలుస్తుంది.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ పొలిటీషియన్ మధ్య జరిగే కథ. ఈ సినిమాలో చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తున్నాడు. అంజలి కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా మరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.