Site icon HashtagU Telugu

Rajamouli : తను తీసిన సినిమాల్లో రాజమౌళి ఫేవరెట్ మూవీ ఏది..?

Rajamouli favorite Movie in his films Revealed in one Interview

Rajamouli favorite Movie in his films Revealed in one Interview

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli )తీసిన సినిమాలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అయితే అవి సృష్టించిన ప్రభంజనం మాత్రం ఏ రేంజ్ లో ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. రాజమౌళి సినిమా మేకింగ్ గురించి మాట్లాడితే.. మగధీర తరువాత, మగధీర(Magadheera) ముందు అని చెప్పొచ్చు. ఎందుకంటే మగధీర తరువాత జక్కన్న తీసే సినిమాల స్పాన్ పెరిగిపోయింది. ఆ తరువాతే ఈగ, బాహుబలి, RRR వంటి హై టెక్నికల్ మూవీస్ ని తెరకెక్కిస్తూ వచ్చాడు.

అయితే మగధీరకు ముందు రాజమౌళి సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ వంటి బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించాడు. మరి తను తీసిన సినిమాల్లో రాజమౌళికి నచ్చిన సినిమా ఏదో తెలుసా..? ఈ విషయం గురించి రాజమౌళిని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. తనకి జవాబు ఇవ్వడం కష్టమని చెప్పుకొచ్చాడు. అయితే జవాబు చెప్పాలని బలవంతం చేయగా.. ‘విక్రమార్కుడు'(Vikramarkudu) సినిమా అంటే కొంచెం ఎక్కువ ఇష్టమని తెలియజేశాడు. రవితేజ(Raviteja) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాల్లో తన దర్శకత్వాన్ని డామినేట్ చేసిన హీరో ఎవరన్నా ఉన్నారంటే.. అది రవితేజ అని చెబుతుంటాడు. ఆ మూవీలో రవితేజ అంతలా నటించాడు. మూవీలో ఒక కామెడీ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో.. రాజమౌళి కట్ చెప్పడం మానేసి కుర్చీలో పొట్టపట్టుకొని నవ్వుతూ కుర్చున్నాడట. అలాంటి విషయాలు మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో చాలా జరిగాయని రవితేజ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కాగా ఈ సినిమాని తరువాత పలు భాషల్లో రీమేక్ చేశారు. తమిళంలో కార్తీ, కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో అక్షయ్ కుమార్ రీమేక్ చేసి వాళ్ళు కూడా సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే ఇండియన్ బెంగాలీ, బంగ్లాదేశ్ బెంగాలీ లాంగ్వేజీలలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. బంగ్లాదేశ్ లో అయితే రెండుసార్లు రీమేక్ చేశారు.

 

Also Read : Manchu Lakshmi: కెమెరాకు అడొచ్చాడని మంచు లక్ష్మి సీరియస్, నెట్టింట్లో వీడియో వైరల్