Site icon HashtagU Telugu

Viral : భార్యతో అదిరిపోయే స్టెప్పులేసిన రాజమౌళి

Rajamouli Dance

Rajamouli Dance

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Rajamouli) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సాధారణంగా సైలెంట్‌గా, నిరాడంబరంగా ఉండే రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి అదిరిపోయే స్టెప్పులు (Rajamouli Dance) వేసి ఆకట్టుకున్నారు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడి పెళ్లి ఈవెంట్ లో రాజమౌళి-రమా జంట డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ వీడియో చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు రాజమౌళి టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు. ఆయనలోని డాన్స్ టాలెంట్ ను బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

“జక్కన్న అదరగొట్టారు” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు , నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. ‘RRR’ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB29’ మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ భాగం కానున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్‌ సెర్చ్‌లో భాగంగా ఇటీవల ఆఫ్రికాలోని అడవుల్లో పర్యటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలు కానుంది.

Read Also : PV Sindhu ot Engaged : ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు