Mahesh Babu : రాజమౌళి సినిమా పూర్తయ్యేంతవరకు మహేష్ వాటికి ఫుల్ స్టాప్..!

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబందించిన వర్క్ షాప్ ని త్వరలో మొదలు పెట్టనున్నారు.

Published By: HashtagU Telugu Desk
New Title Circulating In Social Media Mahesh Rajamouli Movie

New Title Circulating In Social Media Mahesh Rajamouli Movie

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబందించిన వర్క్ షాప్ ని త్వరలో మొదలు పెట్టనున్నారు. సినిమాలో మహేష్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ని దించుతున్నాడట జక్కన్న. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ నే భారీగా ప్లాన్ చేస్తున్నారట.

ఇదిలాఉంటే ఈ సినిమా కోసం మహేష్ కు కొన్ని కండీషన్స్ పెట్టాడట రాజమౌళి. సినిమా కోసం రెండేళ్ల టైం తీసుకుంటున్న జక్కన్న అప్పటివరకు మిగతా ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకూడదని చెప్పాడట. అంతేకాదు ఈ టైం లో యాడ్స్ లో కూడా నటించకూడదని రాజమౌళి కండీషన్ పెట్టాడట.

రాజమౌళి సినిమా అంటే ఇలాంటివి చాలా కామన్. ఆల్రెడీ మహేష్ వాటికి రెడీ అయ్యే రంగంలోకి దిగుతున్నాడు. సో ఈ రెండు మూడేళ్లు అంటే సినిమా పూర్తయ్యే వరకు మహేష్ వాణిజ్య ప్రకటనలు చేసే అవకాశం లేదని తెలుస్తుంది. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుంది.

Also Read : Venkatesh Trisha : వెంకటేష్.. త్రిష.. సూపర్ హిట్ కాంబో రిపీట్..!

  Last Updated: 22 Feb 2024, 10:55 AM IST