Rajamouli సూపర్ స్టార్ మహేష్ తో సినిమా కోసం రాజమౌళి భారీ మార్పులను చేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ తో చేస్తున్న భారీ సినిమాకు తగినట్టుగానే జక్కన్న తన టీం లో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే టీం అంతా ఒకటే ఉంటుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా తన టెక్నికల్ టీం ని కూడా అంతే బాగా చూసుకుంటాడు రాజమౌళి. తను ఎంత పెద్ద సినిమా తీసినా సరే వారి ప్రమేయం ఉండాల్సిందే.
అయితే మహేష్ సినిమాకు రాజమౌళి కొత్త టీం తో పనిచేయాలని అనుకుంటున్నారట. దాని వెనక కారణాలు ఏంటన్నది తెలియదు కానీ రాజమౌళి మహేష్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ని పక్కన పెట్టి పిఎస్ వినోద్ ని తీసుకుంటున్నారట. అంతేకాదు వి.ఎఫ్.ఎక్స్ శ్రీనివాస్ బదులుగా కమల్ కన్నన్ ని.. ఎడిటర్ శ్రీకరం ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ వీళ్లందరినీ మార్చేస్తున్నాడట రాజమౌళి.
జక్కన్న ఈ సడెన్ డెసిషన్ వెనక రీజన్ ఏంటన్నది తెలియదు కానీ ఇది రాజమౌళి భారీ ప్లాన్ లో భాగమే అనుకుంటున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న మహేష్ 29వ సినిమాలో టెక్నికల్ టీం అంతా రెడీ అవుతుంది. ఐతే సినిమా కాస్టింగ్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టార్స్ ని కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు రాజమౌళి.
గుంటూరు కారం తర్వాత మహేష్ చేస్తున్న ఈ మూవీతో తను కూడా గ్లోబల్ స్టార్ గా ఎదగనున్నాడు. తప్పకుండా మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెవర్ బిఫోర్ రికార్డులను అందుకుంటుందని చెప్పొచ్చు.