Rajamouli ఒక సినిమా హిట్ అయ్యేందుకు దర్శకుడు ఎంత కష్టపడి పనిచేస్తాడో అదే రేంజ్ లో మిగతా టీం అంతా కష్టపడుతుంది అయితే డైరెక్టర్ కి ఈక్వల్ గా క్రూ లో ఎక్కువ కష్టపడేది సినిమాటోగ్రాఫర్. డైరెక్టర్ చెప్పిన షాట్ ని ముందు అతను అర్ధం చేసుకునే కెమెరాలో అది బంధిస్తాడు.
సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ అంతా కూడా వారికి వచ్చిన క్రెడిట్ లో సగం వారి కెమెరా మెన్ కి ఇచ్చేస్తారు. అలానే రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ప్రతి సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఇనిమాను హరి అనుమోలు సినిమాటోగ్రఫీ చేయగా సింహాద్రి సినిమాకు రవీంద్ర బాబు కెమెరా మెన్ గా పనిచేశారు. సై సినిమా నుంచి సెంథిల్ కుమార్ తో కలిసి పనిచేస్తున్నారు రాజమౌళి. మధ్యలో విక్రమార్కుడుకి సర్వేష్ మురారి, మర్యాదరామన్నకు రాం ప్రసాద్ పనిచేశారు. కానీ రాజమౌళి అద్భుత సృష్టి ఐకానిక్ సినిమాలైన మగధీర, బాహుబలి 1 & 2, RRR సినిమాలకు సెంథిల్ కుమార్ (Senthil Kumar) సినిమాటోగ్రఫీ అందించారు.
Also Read : Nidhi Agarwal : నిధి అగర్వాల్.. మైండ్ ‘బ్లాక్’ చేస్తున్న అందాలు..!
అయితే రాజమౌళి నెక్స్ట్ సినిమాకు సెంథిల్ కుమార్ పనిచేయడం కష్టమని అంటున్నారు. ఎప్పటి నుంచో సెంథిల్ కుమార్ డైరెక్టర్ గా మారాలని అనుకుంటున్నాడు. రాజమౌళితో సినిమాలు చేస్తూ అది కుదరడం లేదు.
అందుకే రాజమౌళి నుంచి బయటకు వచ్చి సొంతంగా ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. రాజమౌళి సెంథిల్ కుమార్ తో కాకుండా ఈసారి ఎవరితో పనిచేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. సెంథిల్ లేకపోయినా సరే రాజమౌళి తన సినిమాను అదే రేంజ్ లో చూపించగలడా లేదా అన్నది చూడాలి.
We’re now on WhatsApp : Click to Join
