Prabhas : ఛత్రపతికి ముందు రాజమౌళిని ప్రభాస్ దూరం పెట్టాడు.. ఎందుకో తెలుసా?

ఛత్రపతితో మాస్ ఫాలోయింగ్, బాహుబలితో పాన్ ఇండియా ఇమేజ్ ని ఇచ్చిన రాజమౌళిని ప్రభాస్ ఒక సమయంలో దూరం పెడుతూ వచ్చాడు. అసలు విషయం ఏంటంటే..

Published By: HashtagU Telugu Desk
Rajamouli and prabhas interesting facts do you know

Rajamouli and prabhas interesting facts do you know

ప్రభాస్‌(Prabhas)ని టాలీవుడ్(Tollywood) రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ ని చేసిన దర్శకుడు రాజమౌళి(Rajamouli). బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ ని అందించి ఇండియాలోనే టాప్ స్టార్ గా నిలబెట్టాడు. బాహుబలినే కాదు అంతకముందు ‘ఛత్రపతి’ వంటి హిట్టుని కూడా ఇచ్చాడు. ఆ సినిమాతోనే ప్రభాస్ కి మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ వచ్చింది. తన కెరీర్ లో ఇంతటి ముఖ్య పాత్ర పోషించిన రాజమౌళిని ప్రభాస్ ఒక సమయంలో దూరం పెట్టాడు. రాజమౌళి తన మొదటి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 అంటూ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా తరువాత రాజమౌళి ప్రభాస్ తో ఒక సినిమా తియ్యడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ కి కథ చెప్పడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ప్రభాస్ మాత్రం రాజమౌళిని దూరం పెడుతూ వచ్చాడు. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ కి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అసలు నచ్చలేదట. ఆ సినిమా ఎందుకు హిట్టు అయ్యిందో అని అనుకున్నాడట. ఆ సినిమా నచ్చకపోవడంతోనే రాజమౌళితో సినిమా చేయడం ఇష్టం లేక దూరం పెడుతూ వచ్చాడు. ఇక ప్రభాస్ స్పందించకపోవడంతో రాజమౌళి తన రెండు సినిమాని కూడా సింహాద్రి అంటూ ఎన్టీఆర్ తోనే తీశాడు.

ఇక ఆ మూవీ ప్రీమియర్ కి ఎన్టీఆర్, ప్రభాస్ ని ఆహ్వానించాడు. సింహాద్రి సినిమా చూసిన తరువాత ప్రభాస్ షాక్ అయ్యాడట. అసలు ఈ సినిమా తీసింది స్టూడెంట్ నెంబర్ 1 తీసిన రాజమౌళినేనా అని సందేహపడ్డాడట. సింహాద్రి చూసిన తరువాత నుంచి రాజమౌళిపై ప్రభాస్ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి రాజమౌళి పూర్తిగా నమ్మడం మొదలు పెట్టాడు. దీంతో ఛత్రపతి సినిమాకు ఓకే చెప్పి ఆ తర్వాత ఆ నమ్మకంతోనే తన కెరీర్ లో 5 ఏళ్ళ సమయాన్ని రాజమౌళి అడిగాడు అని ఆలోచించకుండా బాహుబలి సినిమా కోసం ఇచ్చేశాడు. అయితే తన నమ్మకాన్ని రాజమౌళి కూడా నిలబెట్టాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాన్ని తెలిపాడు. రాజమౌళి, ప్రభాస్ ఇప్పుడు మంచి స్నేహితులు కూడా.

 

Also Read :  Dimple Hayathi : డింపుల్ హయతిపై కేసు.. డింపుల్ వర్షన్ ఏంటి? లీగల్ గా ఫైట్ చేస్తాం అంటున్న లాయర్..

  Last Updated: 24 May 2023, 06:12 PM IST