RRR: జపాన్ లో రికార్డుల మోత మోగిస్తున్న ఆర్ఆర్ఆర్.. మరో అరుదైన రికార్డ్?

టాలీవుడ్ దర్శకరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా

  • Written By:
  • Publish Date - April 4, 2023 / 04:18 PM IST

టాలీవుడ్ దర్శకరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇప్పటికీ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు. ఇందులో నటించిన ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గ్లోబల్ స్టార్ గా మారడంతో పాటు ఆస్కార్ అవార్డుని సైతం అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కూడా ముగిసింది.

దేశవ్యాప్తంగా ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. గత ఏడాది ఈ సినిమా జపాన్ లో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను జపాన్ లో కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా 164 రోజుల్లో వన్ మిలియన్ ఫుట్ ఫాల్స్ ని రాబట్టి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. కేవలం జపాన్లో మాత్రమే దాదాపు 100 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.

 

అంతే కాకుండా ఇప్పట్లో ఈ సినిమా జోరు తగ్గేలా కనిపించడం లేదు. కాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా టాపర్ గ్రాఫర్ గా ఉండేది. అయితే రజనీకాంత్ సినిమా రికార్డులను బ్రేక్ చేయడానికి ఒక ఇండియన్స్ సినిమాకి దాదాపు పాతికేళ్లు పట్టింది. మరి ఈ ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డులను బ్రేక్ చేయడానికి మరో పాతికేళ్లు పడుతుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఏది ఏమైనప్పటికీ జపాన్లో ఆర్ఆర్ఆర్ జోష్ చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా రికార్డుల మోత ఆగేలా కనిపించడం లేదు.