Site icon HashtagU Telugu

Rajamaouli : రాజమౌళి స్పీడ్ పెంచాల్సిందే..!

Mahesh Rajamouli Update will come on Birthday

Mahesh Rajamouli Update will come on Birthday

Rajamaouli RRR తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా లాక్ చేసుకున్నాడని తెలిసిందే. ఈ సినిమా విషయంలో జక్కన్న ప్లానింగ్ చాలా పెదగా ఉందని తెలుస్తుంది. ఆఫ్రికా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ యాక్షన్ మూవీకి మహేష్ లుక్ చాలా ప్రాధాన్యం కాగా సూపర్ స్టార్ ని ఇదివరకు ఎప్పుడు చూపించని క్రేజీ లుక్స్ లో రాజమౌళి మహేష్ ని చూపిస్తారని అంటున్నారు. ఇప్పటికే మహేష్ తన మేకోవర్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. లాంగ్ హెయిర్ తో ఈమధ్య సూపర్ స్టార్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

ఐతే సినిమా ఎప్పుడు మొదలుపెడతారా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. రాజమౌళి ఈ సినిమా కోసం వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాను ఎప్పటిలా 3, 4 ఏళ్లు కాకుండా తక్కువ టైం లోనే సినిమా పూర్తి చేస్తానని అంటున్నారు రాజమౌళి. ఐతే అలా చెప్పిన ఆయన సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి చాలా లేట్ చేస్తున్నాడని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే 31న సినిమా మొదలవుతుందని అనుకోగా అప్పుడు కాలేదు. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే నాడైనా సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి ఈ కాంబో మూవీ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ టార్గెట్ తో వస్తుంది. తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మాత్రం అర్ధమవుతుంది. సినిమా కోసం మహేష్ కూడా మెంటల్ గా తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తుంది.

Also Read : Ram Charan : గేమ్ ఛేంజర్ లెక్క తేలట్లేదు..?