రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి (Maruthi) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా రాజా సాబ్ (Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్ లో ప్రేక్షకులను భయపెడుతూ నవ్వించాలని వస్తున్న రాజా సాబ్ సినిమా 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఐతే సినిమా రిలీజ్ ని 2025 ఏప్రిల్ 10న లాక్ చేశారు. సినిమా అనుకున్న టైం కు రిలీజ్ కష్టమే అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఐతే రాజా సాబ్ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక ఫోటో లీక్ అయ్యింది. అందులో అందాల భామ నిధి అగర్వాల్ గ్లామరస్ గా కనిపిస్తుంది. మరి సెట్స్ నుంచి ఎలా లీక్ అయ్యిందో ఏమో కానీ రాజా సాబ్ లీక్డ్ ఫోటోగా నిధి అగర్వాల్ (Nidhi Agarwal,) ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యింది.
స్టార్ సినిమాల విషయంలో మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ లీకుల బెడద తప్పట్లేదు. రాజా సాబ్ లో ప్రభాస్ కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను మారుతి నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. నిధి ఫోటో లీక్ అవగా రాజా సాబ్ లో అమ్మడి గ్లామర్ డోస్ పెంచినట్టే ఉందని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమాతో పాటుగా హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా కూడా సెట్స్ మీద ఉంది.