Raj Tharun : గత రెండు రోజుల నుంచి రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్నాడు. లావణ్య అనే అమ్మాయి.. రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసాడు, ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉంటున్నాడు అని ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై రాజ్ తరుణ్ స్పందించి.. నేను ఆ అమ్మాయి గతంలో రిలేషన్ లో ఉన్నాము, కానీ ఆ అమ్మాయి ప్రవర్తన మారింది, డ్రగ్స్ కి అలవాటు అయింది,నేను చెప్పినా మానలేదు, అందుకే రిలేషన్ నుంచి బయటకు వచ్చేసాను. ఆమెకు వేరే అబ్బాయితో రిలేషన్ ఉంది అని అన్నాడు. మరో పక్క లావణ్య మాల్వి అనే హీరోయిన్ పై ఆరోపణలు చేయడంతో ఆమె కూడా పోలీస్ స్టేషన్ లో తన పరువుకు నష్టం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.
అయితే తాజాగా మళ్ళీ లావణ్య ప్రెస్ మీట్ పెట్టి.. రాజ్ తరుణ్ వైజాగ్ లో ఉన్నప్పట్నుంచి తెలుసు. సినీ పరిశ్రమకి వచ్చినప్పటి నుంచి కలిసే ఉన్నాం. హీరోగా ఎదుగుతుండటంతో నేను ప్రాబ్లమ్ అవ్వకూడదని సైలెంట్ గా ఉన్నాను. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా నా కోసం రాజ్ తరుణ్ బయటకి రాలేదు. మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం. పదేళ్లుగా కలిసి ఉన్నాం. ఇప్పుడు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్, మాల్వి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నాకు రాజ్ తరుణ్ కావాలి. మాల్వి వాళ్ళ ఫ్యామిలీ హిమాచల్ ప్రదేశ్ సీఎంకు క్లోజ్. వాళ్ళు నన్ను భయపెట్టారు అని తెలిపింది. మరి దీనిపై రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఏమని స్పందిస్తారో చూడాలి.
Also Read : NTR – Shouryuv : నాని డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్..? ఇప్పట్లో అవుతుందా?