చిత్రసీమలో ఇప్పుడు రాజ్ తరుణ్ – లావణ్య (Raj Tarun & Lavanya) ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరికి సంబదించిన ఇష్యూ రోజు రోజుకు ఆసక్తిగా మారుతుండడం తో వీరికి సంబంధించి ఏ విషయం బయటకు వచ్చిన వైరల్ గా మారుతుంది. తాజాగా రాజ్ తరుణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం బయటకు రావడం తో అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
ఉయ్యాలా జంపాల మూవీ తో హీరోగా పరిచమైన రాజ్ తరుణ్ (Raj Tarun )..ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్లాప్స్ ఎదురవ్వడం..కొత్త హీరోలు ఎంట్రీ ఇవ్వడం..సరికొత్త కథలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుండడం తో రాజ్ తరుణ్ ను పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ క్రమంలో తన మాజీ లవర్ లావణ్య..రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు పెట్టడం ఒక్కసారిగా రాజ్ తరుణ్ ను వివాదాల్లోకి నెట్టింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడని , రెండు సార్లు కడుపు కూడా చేసి అబార్షన్ చేయించాడని..ఇప్పుడు మరో హీరోయిన్ తో దగ్గరై తనను దూరం చేసాడని సాక్ష్యాలతో పోలీసుల ఎదుట కూర్చుంది. దీంతో రాజ్ తరుణ్ పై పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో రాజ్ తరుణ్ స్నేహితుడు ,నటుడు మధునందన్ (Madhunandan) గతంలో రాజ్ తరుణ్ ఆత్మహత్యాయత్నం (Raj Tarun Suicide Attempt ) కు పాల్పడిన విషయాన్నీ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపి షాక్ ఇచ్చారు. కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించి, దానిని పొడిగించుకుంటూ పోవడం తో ఆ సమాయంలో గోవాకు విహారయాత్ర నిమిత్తం వెళ్లిన రాజ్‌తరుణ్ కుటుంబం లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఏదో కొద్దిరోజులు ఉంటుంది అనుకుంటే , ఏకంగా రెండు నెలలు లాక్‌డౌన్ ఉండటంతో రాజ్‌తరుణ్ హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాడని మధునందన్ తెలిపారు. బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా జీవించలేక తనకు ఓ రోజు ఫోన్ చేసి ఇంకో వారం పరిస్ధితి ఇలాగే ఉంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో తన ఫ్రెండ్ కారుకి ఎమర్జెన్సీ పాస్ ఉండడం తో దాని ద్వారా ట్రాఫిక్ పోలీసులకు నిత్యావసర సరుకులు అందించే వాళ్లమని మధునందన్ తెలిపారు. ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు సోషల్ మీడియా లో అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Nandamuri Tejaswini : చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్న బాలకృష్ణ చిన్న కూతురు..?