Site icon HashtagU Telugu

Raj Tarun – Malvi Malhotra : ఎట్టకేలకు లావణ్య వివాదంపై స్పందించిన రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా..

Raj Tarun, Malvi Malhotra, Lavanya

Raj Tarun, Malvi Malhotra, Lavanya

Raj Tarun – Malvi Malhotra : టాలీవుడ్ లో గత కొన్నిరోజులుగా రాజ్ తరుణ్-లావణ్య వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ తనని మోసం చేసాడని, పదేళ్లు ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకొని తనని గర్భవతిని కూడా చేసాడని, ఆ తరువాత అబార్షన్ చేయించి తనని వదిలేసాడని వివాదాస్పద ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్లో ఒక హీరోయిన్ పేరుని కూడా లావణ్య ప్రస్తావించింది. తనని మోసం చేసిన రాజ్ తరుణ్.. ఇప్పుడు హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్నాడని వ్యాఖ్యానించింది. అంతేకాదు రాజ్ తరుణ్ పై పోలీస్ కంప్లైంట్ కూడా నమోదు చేసింది.

ఇక ఈ మొత్తం వివాదం పై రాజ్ తరుణ్ ఇప్పటివరకు సరైన వివరణ ఇవ్వలేదు. తాజాగా తన మూవీ ప్రెస్ మీట్ లో ఆ వివాదం గురించి రాజ్ తరుణ్ వివరణ ఇస్తూ.. “లావణ్య నేను ప్రేమించుకున్న మాట నిజమే, కానీ మాకు ఎప్పుడో బ్రేకప్ అయ్యిపోయింది. లావణ్య చేసేది కేవలం ఆరోపణలు మాత్రమే. తనకి అబార్షన్ చేయించాను అని ఆరోపణలు చేసింది. కానీ ఎఫ్ఐఆర్ లో మాత్రం అది చెప్పలేదు. ఆమె ఆరోపణలు చేస్తుంది కానీ ప్రూఫ్స్ చూపించడం లేదు. నా దగ్గర కొన్ని ప్రూఫ్ లు ఉన్నాయి. కానీ అవి చూపించడం వాళ్ళ వేరే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకనే అవి బయట పెట్టడం లేదు. కానీ లీగల్ గా నేను ఏం చెయ్యాలో అది చేస్తాను. నేను పోలీసులకు ఇవ్వాల్సిన వివరణ ఇచ్చాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇదే ప్రెస్ మీట్ లో హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా పాల్గొనగా, ఆమె కూడా లావణ్య వివాదంపై మాట్లాడుతూ.. “నాపై, నా బ్రదర్ పై లావణ్య చేసిన ఆరోపణలకు నేను పోలీసులకు వివరణ ఇచ్చాను. నేను ఏ తప్పు చేయలేదు. నేను కానీ, నా కుటుంబసభ్యులు కానీ లావణ్యని ఎప్పుడు కలవలేదు. ఇటీవల ఆమె నాకు మెసేజ్ చేసింది. దానిని కూడా పోలీసులకు చూపించాను. లావణ్య క్రిమినల్స్ తో కలిసి ఒక క్రిమినల్ గా బిహేవ్ చేస్తుంది. ఇక పై తనతో ఏదైనా లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను” అంటూ చెప్పుకొచ్చింది.