Site icon HashtagU Telugu

Rahul Ramakrishna : సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న నటుడు.. కొన్నాళ్లపాటు ఇంటర్నెట్ కు దూరంగా ఉంటా అంటూ..

Rahul Ramakrishna Taking Break From Social Media

Rahul Ramakrishna

Rahul Ramakrishna : ప్రస్తుతం అందరం సోషల్ మీడియా ప్రపంచంలోనే బతుకుతున్నాం. సెలబ్రిటీలు కూడా ప్రేక్షకులు, ఫ్యాన్స్ తో సోషల్ మీడియాతోనే కాంటాక్ట్ అవుతున్నారు. కానీ చాలా మంది సోషల్ మీడియాకు అడిక్ట్ కూడా అవుతున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. తాజాగా నటుడు రాహుల్ రామకృష్ణ కూడా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.

అర్జున్ రెడ్డి సినిమాలో హీరోఫ్రెండ్ పాత్రలో నటించి పాపులర్ అయిన రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలతో మెప్పించాడు. అప్పుడప్పుడు తన ట్వీట్స్ తో వైరల్ అవుతూ ఉంటాడు రాహుల్ రామకృష్ణ. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పాత పోస్టులు అన్ని డిలీట్ చేసి కొత్తగా.. నేను బ్రేక్ తీసుకుంటున్నాను. ఇంటర్నెట్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఓ కొత్త అవతారంలో, కొత్త ఎనర్జీ, ఐడియాలతో మళ్ళీ కొన్ని రోజులకు వస్తాను. అప్పటి దాకా నన్ను మిస్ అవ్వండి అంటూ ఓ పోస్ట్ షేర్ చేసాడు.

దీంతో రాహుల్ పోస్ట్ వైరల్ అవ్వగా రాహుల్ ఎందుకు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్య సినిమాలు కూడా రెగ్యులర్ గా కాకుండా అడపాదడపా చేస్తున్నాడు రాహుల్.

 

Also Read : Rajendra Prasad : పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు.. పద్మశ్రీ లేదని చెప్తే రామోజీరావు గారు..