Site icon HashtagU Telugu

AR Rahman : హాస్పటల్ నుండి రెహమాన్ డిశ్చార్జ్

Rahman Discharged From Hosp

Rahman Discharged From Hosp

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రి (Apollo Hospital Chennai)లో చికిత్స తీసుకున్నారు. శనివారం రాత్రి ఛాతి నొప్పితో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రి వైద్య బృందం వెంటనే పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించారు. రెహమాన్ అస్వస్థతకు గ్యాస్ట్రిక్ సమస్యలు, డీహైడ్రేషన్ కారణమని వైద్యులు తెలిపారు.

Aurangzebs Tomb: ఔరంగజేబు సమాధిపై వివాదం.. వీలునామాలో సంచలన విషయాలు

ప్రత్యేక వైద్యసేవల తర్వాత రెహమాన్ ఆరోగ్యం మెరుగుపడిందని, మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి (Discharge ) చేశామని ఆసుపత్రి ప్రతినిధులు వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సిఫారసు చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంటికి తిరిగివెళ్లిన రెహమాన్ త్వరలోనే తన సంగీత కార్యక్రమాలు తిరిగి ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సోదరి రిహానా స్పష్టం చేశారు. అభిమానులు, సంగీత ప్రియులు రెహమాన్ ఆరోగ్యంపై చింతిస్తున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. రహమాన్ తాను ఆరోగ్యంగా ఉన్నానని, అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.