Site icon HashtagU Telugu

K Raghavendra Rao : రాఘవేంద్ర కొడుకు హీరోగా రెండు సినిమాలు చేసిన విషయం తెలుసా?

Raghavendra Rao son Prakash Kovelamudi movies

Raghavendra Rao son Prakash Kovelamudi movies

టాలీవుడ్(Tollywood) దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు(Raghavendra Rao).. సీనియర్ ఎన్టీఆర్(NTR) నుంచి ఎంతోమంది హీరోలను డైరెక్ట్ చేశారు. అంతేకాదు దర్శకుడిగా ఎంతోమంది హీరోలకు స్టార్ స్టేటస్ ని అందించాడు. కొంతమంది హీరోలను వెండితెరకు పరిచయం కూడా చేశారు. అలాంటి దర్శకుడు కుమారుడు హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడని, రెండు సినిమాల్లో హీరోగా కనిపించాడు అనే విషయం.. ఇప్పటి వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. రాఘవేంద్రరావు కొడుకు పేరు ప్రకాష్(Prakash).

2002లో ‘నీతో’ అనే సినిమాతో ప్రకాష్ హీరోగా పరిచయం అయ్యాడు. జాన్ మహేంద్రన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. బాలీవుడ్ భామ మెహెక్ చాహల్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, సునీల్ వంటి స్టార్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకం పై రామోజీరావు ఈ సినిమాని నిర్మించాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఇదే సినిమాని దర్శకుడు జాన్ మహేంద్రన్.. తమిళంలో విజయ్ తో తీసి మంచి విజమే అందుకున్నాడు.

ఇక మొదటి సినిమా ఫెయిల్ అవ్వడంతో ప్రకాష్.. రెండేళ్ల గ్యాప్ తీసుకోని 2004 లో ఒక ఇంగ్లీష్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ‘మార్నింగ్ రాగా’ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు నిర్మించారు. ప్రకాష్ ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసి దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నాడు. దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ‘బొమ్మలాట’.. ఏకంగా నేషనల్ అవార్డుని అందుకుంది. కానీ ఆ తరువాత తీసిన ఏ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేకపోయాయి. దర్శకుడిగా ఇప్పటి వరకు 4 సినిమాలను తెరకెక్కించాడు. సిద్దార్థ్ తో అనగనగ ఒక ధీరుడు, అనుష్కతో సైజ్ జీరో, హిందీలో కంగనాతో ఒక సినిమా. ఇప్పటి వరకు మరో సినిమాని ప్రకటించలేదు రాఘవేంద్రరావు తనయుడు.

 

Also Read :  Pawan Kalyan : పవన్ నటించిన సినిమాల్లో సగం రీమేక్ లే.. ఆ చిత్రాలు ఏంటో తెలుసా?