Site icon HashtagU Telugu

Raghava Lawrence : కమల్‌హాసన్‌ విక్రమ్ సినిమాలో ఆ పాత్రని రాఘవ లారెన్స్‌ చేయాల్సిందట..

Raghava Lawrence missed Santhanam Character in Vikram Movie Played by Vijay Sethupathi

Raghava Lawrence missed Santhanam Character in Vikram Movie Played by Vijay Sethupathi

లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో లోకనాయకుడు కమల్‌హాసన్‌ ( Kamal Haasan) హీరోగా తెరెక్కిన సినిమా ‘విక్రమ్‌’. ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో కమల్ తో పాటు మరికొంతమంది హీరోలు కూడా కనిపించిన సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) సెకండ్ హీరోగా కనిపించాడు. ఇక మూవీ ఎండింగ్ లో సూర్య (Suriya) మాస్ ఎంట్రీ ఇచ్చి కొన్ని నిమిషాల్లో ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేశాడు.

అయితే ఈ పాత్రల్లో ఒకదానిని నటుడు, డ్యాన్సర్ రాఘవ లారెన్స్‌(Raghava Lawrence) చేయాల్సిందట. ఈ విషయాన్ని లారెన్సే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ పాత్ర ఏంటిది..? అదే నెగటివ్ షేడ్ ఉన్న విజయ్ సేతుపతి క్యారెక్టర్. ఈ పాత్ర కోసం డైరెక్టర్ లోకేష్ ముందుగా లారెన్స్ ని సంప్రదించాడట. లారెన్స్ కూడా ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఇతర ప్రాజెక్ట్ లతో లారెన్స్ బిజీగా ఉండడంతో డేట్స్ సర్దుబాటు అవ్వక ఆ పాత్రని చేయలేకపోయాడట. దీంతో లోకేష్, విజయ్ సేతుపతిని సంప్రదించడం, అతను ఓకే చెప్పడం జరిగిపోయింది. అలా మూవీలో సంతానం క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేశాడు.

ఇక మూవీలో ఆ పాత్రని విజయ్ సేతుపతి చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. అతని ఎంట్రీ దగ్గర నుంచి విభిన్నమైన మ్యానరిజంతో విజయ్ సేతుపతి చేసిన యాక్టింగ్.. ప్రేక్షకులను ఆ పాత్రలో తనని తప్ప మరొకర్ని ఉహించుకోకుండా చేసింది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించి ఏకంగా 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కమల్ హాసన్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమా.

 

Also Read : Pawan Kalyan : యాక్షన్ మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్.. షూటింగ్స్ తో పవర్ స్టార్ బిజీ