Raghava Lawrence: ‘రుద్రుడు’గా రాఘవ లారెన్స్!

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Rudrudu

Rudrudu

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రుద్రు’డు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా యాక్షన్‌లో హైలైట్‌గా వుండబోతుంది.

‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తినిపెంచింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు. సినిమా తొంభై శాతం షూటింగ్ పూర్తయింది. ‘రుద్రుడు’ 2022 క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల కానుంది.

  Last Updated: 24 Jun 2022, 02:49 PM IST