Site icon HashtagU Telugu

Raghava Lawrence: అభిమాని మరణించడంతో అలాంటి నిర్ణయం తీసుకున్న రాఘవ లారెన్స్.. నేనే మీ వద్దకు వస్తానంటూ?

Mixcollage 25 Feb 2024 10 43 Am 5073

Mixcollage 25 Feb 2024 10 43 Am 5073

తెలుగు ప్రేక్షకులకు హీరో డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టిన రాఘవ లారెన్స్ ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు. కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. గ్రూప్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్,హీరో, నిర్మాత ఇలా అన్నీ రంగాలలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు. లారెన్స్‌ తనలోని దర్శక నిర్మాత హీరోని అందరికీ పరిచయం చేశాడు. ఆన్ స్క్రీన్ కంటే రాఘవ లారెన్స్‌ను ఆఫ్ స్క్రీన్‌లోనే అంతా ఇష్టపడుతుంటారు.

రాఘవ లారెన్స్ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా గంగా,కాంచన. సినిమాలతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు రాఘవ లారెన్స్. ఇకపోతే రాఘవ లారెన్స్ చేసే సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా సమయంలోనూ లారెన్స్ ఎంత మందికి ఎన్ని విధాలుగా సాయపడ్డాడో అందరికీ తెలుసు. ఎంతో మందికి నీడ కల్పించాడు. అన్నం పెట్టించాడు. ఇతరులు విరాళం ఇస్తానంటే కూడా వద్దాన్నాడు. దేవుడు తనకు శక్తిని ఇచ్చాడని, తన శక్తి మేరకు అందరికీ సాయ చేసేందుకు ప్రయత్నిస్తుంటాను అని అన్నాడు. అనాథ పిల్లలను చదివిస్తుంటాడు.

వృద్దాశ్రమాలు నడిపిస్తుంటాడు. ఇక లారెన్స్ నిత్యం నిత్యం రాఘవేంద్ర స్వామిని పూజిస్తుంటాడు. అభిమానుల కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. ఒక సారి అభిమానులంతా కూడా తనను కలిసేందుకు ఫోటో దిగేందుకు వచ్చారట. ఆ క్రమంలో ఒక అభిమాని ప్రమాద వశాత్తు మరణించాడట. అప్పటి నుంచి రాఘవ లారెన్స్ ఇకపై ఫ్యాన్ మీట్ పెట్టి అభిమానుల్ని తన వద్దకు వచ్చేలా కాకుండా తానే అభిమానుల వద్దకు వెళ్లి, వారిని కలిసి, ఫోటోలు దిగాలని ఫిక్స్ అయ్యాడట. ఈ మేరకు ఆదివారం విల్లుపురంకు వెళ్లనున్నట్టుగా లారెన్స్ ప్రకటించాడు. ఇక లారెన్స్ మంచిదనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలా అభిమానుల వద్దకు రావడం, వారితో టైం స్పెండ్ చేయాలని అనుకోవడం చాలా అరుదు అని, ఇలా ఫ్యాన్స్ కోసం హీరోనే కదిలి రావడం ఫ్యాన్ మీట్ అనే దానికి అర్థాన్ని మార్చడం మామూలు విషయం కాదు అంటూ లారెన్స్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version