ఎట్టకేలకు బాలకృష్ణ (balakrishna) హీరోయిన్ తల్లికాబోతుంది..అది కూడా పెళ్లి చేసుకున్న 12 ఏళ్లకు. బాలకృష్ణ సరసన లెజెండ్ మూవీ లో నటించిన రాధికా ఆప్టే (Radhika Apte)..తల్లి కాబోతుంది. ఈమె నటించిన ‘సిస్టర్ మిడ్నైట్’ మూవీని BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్న సందర్భంగా రాధిక బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది. 2012లో బ్రిటిష్ మ్యూజిక్ కంపోజర్ బెనెడిక్ట్ టేలర్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్ళికి ముందు కంటే పెళ్లి తర్వాత ఎక్కువగా బోల్డ్ చిత్రాల్లో నటించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంది. పార్చ్‌డ్ సినిమాలో కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నటించింది. తెలుగు లో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతోపాటు ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించింది రాధికా. తానూ గర్భవతి అన్న పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్, గుణీత్ మోంగా తదితరులు రాధికకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నవంబర్‌లో పండంటి బిడ్డకు రాధికా జన్మనివ్వబోతుంది.
Read Also : Rashi visited Tirumala : తిరుమలలో పవన్ హీరోయిన్ ను గుర్తుపట్టని భక్తులు