Radhika Apte : హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి కాబోతుంది. తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్ లాంటి సినిమాలతో మెప్పించిన రాధికా ఆప్టే ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపొయింది. బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ తో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో, వేరే దేశాల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రాధికా ఆప్టే.
తాజాగా రాధికా ఆప్టే తాను నటించిన సిస్టర్ మిడ్ నైట్ సినిమాని లండన్ లో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించగా అక్కడికి వచ్చింది. రాధికా బేబీ బంప్ తో కనపడటంతో ఆమె త్వరలోనే తల్లి కాబోతుందని తెలుస్తుంది. 2012లో ఇంగ్లాండ్ కి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ బెనడిక్ట్ టేలర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది రాధికా. పెళ్లి విషయం కూడా సైలెంట్ గా ఉంచి పెళ్లి చేసుకున్న సంవత్సరానికి బయటపెట్టింది.
ఇప్పుడు ప్రగ్నెన్సీని కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. సడెన్ గా ఫిలిం ఫెస్టివల్ లోఇలా బేబీ బంప్ తో కనిపించడంతో ఆమె తల్లి కాబోతుందని తెలిసింది. ఫెస్టివల్ లో బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు రాధికా ఆప్టే స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు రాధికాకు కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి బేబీ పుట్టాక అయినా ఆ విషయం చెప్తుందో లేదో చూడాలి.
Also Read : Boyapati Srinu: చిరంజీవి, బాలకృష్ణ మల్టీ స్టారర్ పై బోయపాటి కామెంట్స్