Site icon HashtagU Telugu

Radhe Shyam : మ్యూజిక్ లవర్స్ ను మాయ చేస్తున్న ‘రాధేశ్యామ్’

Prabhas and Shraddha

బాహూబలి, సాహో లాంటి సినిమాల్లో ప్రభాస్ బరువైన పాత్రల్లో కనిపించారు. చాల రోజుల తర్వాత ‘రాధేశ్యామ్ మూవీ’లో లవర్ బాయ్ పాత్రలో మెస్మరైజ్ చేయబోతున్నారు. అందుకుతగ్గట్టే ఈ మూవీ కూడా ఉండబోతోంది. ముఖ్యంగా ఇందులోని పాటలు సంగీత అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

టీజర్ తర్వాత, రాధే శ్యామ్ మేకర్స్ ఎట్టకేలకు ‘సోచ్ లియా’ అనే పూర్తి పాటను విడుదల చేశారు. పూజా హెగ్డే, ప్రభాస్ కెమిస్ట్రీకి కొన్ని ఉత్కంఠభరితమైన విజువల్స్ తో ప్రతి బిట్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సోచ్ లియా తమ రిలేషన్ షిప్ లో ఎలా కష్టతరమైన దశలో వెళుతుందో చూపిస్తుంది. విడివిడిగా, ఒంటరిగా గడిపినట్లు కనిపిస్తుండగా, ఇద్దరూ కలిసి గడిపిన మధురమైన క్షణాల గురించి ఆలోచిస్తున్నారు. అరిజిత్ ఓదార్పు స్వరంతో మిథూన్ సంగీతం అందించారు. ఈ పాట మరింత మనోహరంగా ఉద్వేగభరితంగా ఉంటుంది. ప్రముఖ గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఈ గేయాన్ని రాశారు.

రాధే శ్యామ్ సంక్రాంతి, జనవరి 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బహుభాషా చిత్రం, రాధా కృష్ణ కుమార్ హెల్మ్ చేసి T-సిరీస్ సమర్పణలో UV క్రియేషన్స్ నిర్మించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఇదొకటి. ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version