‘రాధేశ్యామ్’ సంక్రాంతి ఆటలో అరటిపండు అవుతుందా..?

ఆర్టిస్టుల క్రేజ్ సినిమాలకు ఉపయోపడుతుంది. ఈ మాట సినిమా పుట్టిన దగ్గర్నుంచీ వింటున్నాం.. నిజం కూడా అదే. అయితే కొన్నిసార్లు అది వర్తించదు. అలాంటి సందర్భమే ఇప్పుడు ప్రభాస్ రాధేశ్యామ్ కు వచ్చింది.

  • Written By:
  • Updated On - December 14, 2021 / 10:13 PM IST

ఆర్టిస్టుల క్రేజ్ సినిమాలకు ఉపయోపడుతుంది. ఈ మాట సినిమా పుట్టిన దగ్గర్నుంచీ వింటున్నాం.. నిజం కూడా అదే. అయితే కొన్నిసార్లు అది వర్తించదు. అలాంటి సందర్భమే ఇప్పుడు ప్రభాస్ రాధేశ్యామ్ కు వచ్చింది. ఏ ముహూర్తంలో మొదలైందో  కానీ ఈ సినిమా.. అప్పటి నుంచీ ఏ మాత్రం ఆసక్తిని పెంచలేదు. ఏ రోజూ వాహ్ అనిపించే అప్డేట్ రాలేదు. వచ్చిన అప్డేట్స్ ఏవీ అలా అనిపించలేదు. స్టార్ట్ అయిన దగ్గర్నుంచీ అనేక సార్లు వాయిదా పడింది. షూటింగ్ ఎప్పుడూ సజావుగా సాగలేదు. చివరికి ఫ్యాన్స్ కూడా నిర్మాణ సంస్థపై కక్ష కట్టేంతగా విసిగించారు. అయినా ప్రభాస్ తో పాటు హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డే వల్ల ఈ చిత్రానికి భారీ క్రేజ్ వస్తుందని భావించారు మేకర్స్. బట్.. అలాంటిదేం కనిపించడం లేదు. రాధేశ్యామ్ ను సంక్రాంతి బరిలో జనవరి 14న విడుదల చేస్తున్నారు.

ఇక గత నెల నుంచి టీజర్, పాటలు అంటూ ఒక్కోటి విడుదల చేస్తున్నారు. కానీ ఏ ఒక్కటీ ఆకట్టుకోవడం లేదు. సినిమాపై కుతూహలాన్నీ పెంచడం లేదు. ఆ మాటకొస్తే.. ఈ సినిమా సంక్రాంతి బరిలో మరో సినిమాకు పోటీ ఇస్తుందని కూడా ఆ టైమ్ లో విడుదలవుతోన్న ఇతర సినిమాల వాళ్లు భావించడం లేదు అంటే.. రాధేశ్యామ్ పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఆర్ఆర్ఆర్ విడుదలవుతోంది. జనవరి 12న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వస్తుంది. ప్రస్తుతం ఏ మార్కెట్లో చూసినా ఈ రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప.. రాధేశ్యామ్ ప్రస్తావన మాట మాత్రం కూడా ఎక్కడా రావడం లేదు. అందుకు కారణం.. వీళ్లు విడుదల చేస్తోన్న పాటల్లో కూడా అదే నీరసం కనిపించడం. పాటలతో మెస్మరైజ్ చేస్తే కనీసం అందరి అటెన్షన్ ఆ సినిమాపై పడుతుంది. అలా కూడా ఏం జరకపోవడంతో రాధేశ్యామ్ ను సంక్రాంతి బరిలో అరటిపండులా భావించొచ్చా అంటూ ఇతర హీరోల అభిమానులు సెటైర్స్ కూడా వేస్తున్నారు.

1960ల నేపథ్యంలో యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ అని ముందే చెప్పారు. కానీ ప్రభాస్ లుక్ చూస్తే అతను ప్రేమకథ చేసే హీరోలా కనిపించడం లేదు. వయసు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అది కూడా ఓ మైనస్ లా మారింది. ఏదేమైనా క్రిస్మస్ వరకూ రాధేశ్యామ్ ట్రైలర్ వస్తుందని చెబుతున్నారు. ఆ ట్రైలర్ అయినా సినిమాపై బజ్ క్రియేట్ చేయకపోతే ఈ అరటిపండు మేటర్ నిజమైనా ఆశ్చర్యం లేదు.