Radhe Shyam : ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ గ్లిమ్స్..!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమాను మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Radhe Shyam

Radhe Shyam

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమాను మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు… ప్రేక్షకులను, డార్లింగ్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి వాలెంటైన్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 1:43 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా నుంచి మరొక అప్డేట్ రావడం తో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ‘రాధే శ్యామ్’ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్… ‘రాధే శ్యామ్’ మూవీతో యూనివర్సల్ స్టార్ అవ్వడం పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి ‘రాధే శ్యామ్’ చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో అన్నది వేచి చూడాలి.

Whatsapp Image 2022 02 14 At 9.02.33 Am

  Last Updated: 14 Feb 2022, 02:02 PM IST