Radhe Shyam: రాధేశ్యామ్ ను బీట్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’ దేశవ్యాప్తంగా రూ. 72.41 కోట్లతో 2022లో అత్యధిక ఓపెనర్‌గా నిలిచింది. కానీ హిందీ మార్కెట్‌లో కలెక్షన్లు దెబ్బతిన్నాయి.

  • Written By:
  • Updated On - March 22, 2022 / 04:37 PM IST

రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’ దేశవ్యాప్తంగా రూ. 72.41 కోట్లతో 2022లో అత్యధిక ఓపెనర్‌గా నిలిచింది. కానీ హిందీ మార్కెట్‌లో కలెక్షన్లు దెబ్బతిన్నాయి. మొదటి రోజు కలెక్షన్లతో పోలిస్తే, ఆ తర్వాత రిలీజ్ అయిన ది కాశ్మీర్ ఫైల్స్ దీనికి గట్టి పోటీనిస్తోంది.  బాహుబలి: ది కన్‌క్లూజన్ తర్వాత ప్రభాస్ తదుపరి సినిమా సాహో రూ. 24.40 కోట్లు వసూలు చేసింది. అన్ని భాషలలో కలిపి రూ. 140 కోట్లు వసూలు చేసింది. కాగా రాధే శ్యామ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఓవర్సీస్, శాటిలైట్, డిజిటల్ హక్కుల నుండి రూ. 200 కోట్లకు పైగా క్యాష్ చేసి, థియేట్రికల్ హక్కులను రూ. 105 కోట్ల బిజినెస్ జరిగింది.

అనుపమ్ ఖేర్ నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్‘ మొదటి రోజు ఆశ్చర్యకరంగా రూ. 3.55 కోట్లు సాధించి, రెండవ రోజు రెండింతలు కంటే ఎక్కువ కలెక్షన్లను నమోదు చేసింది. భారతదేశంలోని రాధే శ్యామ్ కలెక్షన్ల కంటే చాలా ఎక్కువ. “కాశ్మీర్ ఫైల్స్‌కి ఇప్పుడు అనేక థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. కేవలం మౌత్ టాక్‌తోనే ది కశ్మీర్ ఫైల్స్ థియేటర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే రాధేశ్యామ్ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించినా, బాలీవుడ్ లో మాత్రం అనుకున్న మేర వసూళ్లను సాధించలేకపోయింది. టాలీవుడ్ లో పాజిటివ్ టాక్ వస్తే.. బాలీవుడ్ నెగిటివ్ టాక్ వినిపించింది. ప్రభాస్ పై పాన్ ఇండియాగా హీరోగా ముద్రపడినప్పటికీ, ఆస్థాయి వసూళ్లు సాధించడంలో వెనుకబడిపోయాడని చెప్పక తప్పదు.