Site icon HashtagU Telugu

Raashi Khanna : మాట నిల‌బెట్టుకున్న రాశి ఖ‌న్నా.. ఈ ఏడాదీ ఆ ప‌ని చేసి చూపించింది..

Rashi Khanna

Rashi Khanna

తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ రాశీఖ‌న్నా ఈ ఏడాది కూడా త‌న బ‌ర్త్‌డే ప్రామిస్‌ని నిల‌బెట్టుకుంది. ప్ర‌తీ ఏటా త‌న పుట్టిన రోజున చెట్టు నాటుతాన‌ని చెప్పిన రాశి..మ‌రోసారి ఆ ప‌ని చేసింది.
భూమిని కాపాడుకోవ‌డంలో నా వంతు పాత్ర‌గా చెప్పిన విధంగా చెట్టు నాటుతున్నాను. అంటూ ఫోటోల‌తో కూడిన వీడియోను రాశి త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.నా పుట్టిన రోజుకు విషెస్ చెప్పిన అంద‌రికీ ధ‌న్యావాదాలు. మీ ప్రేమ నాకు ఎంతో బ‌లాన్నిచ్చింది అని క్యాప్ష‌న్ పెట్టింది రాశీ..