పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి (R Narayana Murthy) స్టైల్ తెలిసిందే. ఆయన మార్క్ అభ్యుదయ భావాలున్న సినిమాలు చేస్తూ ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నారు. అయితే ఆయన్ను రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటింప చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా వర్క్ అవుట్ కాలేదు. తను చేసే సినిమాల్లోనే తను నటిస్తా తప్ప వేరే సినిమాల్లో నటించనని ఆయన ఒక రూల్ పెట్టుకున్నారు. అందుకే ఆయనకు వేరే సినిమాల్లో ఛాన్స్ వచ్చినా చేయలేదు.
ఎన్.టి.ఆర్ పూరీ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమాలో పోసాని కృష్ణ మురళి చేసిన పాత్రని ముందు నారాయణ మూర్తితో చేయించాలని అనుకున్నారు. ఆయన ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇచ్చి ఆ పాత్ర మూర్తి గారితో చేయించాలని అనుకున్నారు. కానీ ఆయన ససేమీరా ఒప్పుకోలేదు. తన పంథాలోనే తను సినిమాలు చేస్తా తప్ప వేరే సినిమాలు చేయనని ఆయన చెప్పారు.
ఇక లేటెస్ట్ గా రాం చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ సినిమాలో కూడా నారాణ మూర్తిని అడిగారట. ఆయన నుంచి మళ్లీ అదే ఆన్సర్ వచ్చిందని తెలుస్తుంది. స్టార్ సినిమాల్లో భారీ రెమ్యునరేషన్ ఇస్తానన్నా సరే నారాయణ మూర్తి మాత్రం నో అంటే నో అనేస్తున్నారు. ఆయన్ను కన్విన్స్ చేసి కమర్షియల్ సినిమాల్లో నటింపచేయడం అసాధ్యమని చెప్పొచ్చు.
చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తుందని టాక్.