R Narayana Murthy : పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఇటీవల ఆరోగ్యం దెబ్బతినడంతో నిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆయన హాస్పిటల్లో చేరారు అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. హాస్పిటల్ నుంచి ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. నిమ్స్ హాస్పిటల్ లో రెండు రోజులు చికిత్స అనంతరం నేడు ఆర్ నారాయణమూర్తి డిశ్చార్జ్ అయ్యారు.
ఆర్ నారాయణమూర్తి డిశ్చార్జ్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. నిమ్స్ లో డాక్టర్ బీరప్ప గారికి, అక్కడ డాక్టర్స్ కు, సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నా క్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నాను అని తెలిపారు. ఆయన త్వరగా కోలుకొని బయటకు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య చదువుకుంటుందా? అన్నా లెజనోవా గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి పవన్..