Good News to Movie Lovers : మూవీ పాస్ విధానాన్ని తీసుకరాబోతున్న ‘పీవీఆర్’

ఓటిటి (OTT) దెబ్బకు ప్రేక్షకులు థియేటర్స్ (Movie Lovers) కు రావడం తగ్గించేశారు. పెద్ద హీరోల (Top heros Movies) చిత్రాల రిలీజ్ టైం లో..అది కూడా ఒకటి రెండు రోజులు తప్పితే థియేటర్స్ దగ్గర సందడి అనేది కనిపించడం లేదు. టికెట్స్ ధరలు ఎక్కువగా ఉండడం..బ్రేక్ సమయంలో స్నాక్స్ కు సైతం ధరలు పెరిగిపోవడం..ఇదే క్రమంలో సినిమా రిలీజ్ అయినా మూడు వారాలకే ఓటిటి లలో స్ట్రీమింగ్ అవుతుండడం తో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులు […]

Published By: HashtagU Telugu Desk
Pvr Good News

Pvr Good News

ఓటిటి (OTT) దెబ్బకు ప్రేక్షకులు థియేటర్స్ (Movie Lovers) కు రావడం తగ్గించేశారు. పెద్ద హీరోల (Top heros Movies) చిత్రాల రిలీజ్ టైం లో..అది కూడా ఒకటి రెండు రోజులు తప్పితే థియేటర్స్ దగ్గర సందడి అనేది కనిపించడం లేదు. టికెట్స్ ధరలు ఎక్కువగా ఉండడం..బ్రేక్ సమయంలో స్నాక్స్ కు సైతం ధరలు పెరిగిపోవడం..ఇదే క్రమంలో సినిమా రిలీజ్ అయినా మూడు వారాలకే ఓటిటి లలో స్ట్రీమింగ్ అవుతుండడం తో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులు థియేటర్స్ రావడం తగ్గించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మూవీ పాస్ (Movie Pass) విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం నార్త్ ప్రేక్షకులకు ఈ పాస్ సేవలు అందుతున్నాయి. తాజాగా దక్షిణాదిలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని సంస్థ రెడీ అవుతోంది. రూ.699కి మూవీ పాస్ అందించనున్నారు. ఈ పాస్ తో నెలకు 10 సినిమాలు చూసే అవకాశం ఉంటుంది.

అయితే ఇక్కడ సంస్థ ఓ ట్విస్ట్ ఇచ్చింది. సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ఈ పాస్ ద్వారా సినిమాలు చూసే వెసులుబాటు కల్పించింది. వీకెండ్స్ లో ఈ పాస్ చెల్లదని స్పష్టం చేసింది. పాస్ లకు సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్లు మొదలు కాగా.. పాస్ లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మల్లిప్టెక్స్ లలో సినిమా చూడాలంటే కనీసం ఒక్కరికి రూ.500 ఈజీ గా అవుతాయి..అదే నెలకు మూడు , నాల్గు సినిమాలు చూడాలంటే రూ.2000 పెట్టాల్సిందే. ఇక ఫ్యామిలీ మొత్తం చూడాలంటే ఎంత అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే PVR పాస్ విధానాన్ని తీసుకరాబోతుంది. ఇది చాలామందికి ఉపయోగకరమనే చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం మాత్రమే ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. సో ..ఈ పాస్ సినీ లవర్స్ కు ఎంతో ఉపయోగపడుతుంది.

Read Also : Public Reaction On CM Jagan Speech : జగన్ నువ్వు ఇక మారవా..?

  Last Updated: 29 Dec 2023, 02:37 PM IST