Site icon HashtagU Telugu

Akhanda 2 : సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో కొ*కా.. బాలయ్య ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్..!

Akhanda 2 Thaandavam

Akhanda 2 Thaandavam

నటసింహా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం అఖండ 2: తాండవం. 2021లో వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ ఇది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బ్లాస్టింగ్ రోర్ పేరుతో మేకర్స్ సరికొత్త అప్డేట్ తో వచ్చారు.

సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడకా.. ఊహకి కూడా అందదు అంటూ బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో వచ్చిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. అఖండ 2 చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటి వరకూ అఘోరా లుక్ తోనే పబ్లిసిటీ చేస్తూ వచ్చారు. దీంతో మురళీ కృష్ణ పాత్ర ఎలా ఉంటుందో అనే ఉత్సుకత నందమూరి అభిమానుల్లో క్రియేట్ అయింది. ఇప్పుడు వచ్చిన బ్లాస్టింగ్ రోర్ తో బాలయ్య సెకండ్ రోల్ ఎలా ఉండబోతుందనేది శాంపిల్ గా చూపించింది.

బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ని ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ లో చూపించారు. ఇది సినిమాలో మురళీ కృష్ణ పాత్ర ఇంట్రడక్షన్ ఫైట్ అనిపిస్తోంది. బాలయ్య గర్జిస్తే గుర్రాలు కూడా బెదిరిపోయి రంకెలు వేసినట్లుగా ఎలివేట్ చేశారు. ఎస్. థమన్ ఎప్పటిలాగే బాలకృష్ణకి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ కూడా బాగున్నాయి. రేపు థియేటర్లు బ్లాస్ట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నార్మల్ ఆడియన్స్ మాత్రం ఇందులో కొత్తేమీ లేదని, రొటీన్ గా ఉందని ట్రోల్ చేస్తున్నారు.

‘అఖండ’ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. దీనికి రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సి రాంప్రసాద్, సంతోష్ డి డెటాకే సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. కోటగిరి వెంకటేశ్వరావు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

‘అఖండ 2: తాండవం’ చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వస్తోన్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version