లైంగిక వేధింపుల ఆరోపణలు జానీ మాస్టర్ (Jani Master) కెరియర్ ను తలకిందులు చేస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ అవార్డు (National Award) చేజారగా..ఇప్పుడు బడా ఛాన్సులు కూడా రాకుండా పోతున్నాయి. తాజాగా పుష్ప 2 లో జానీ ప్లేస్ లో మరో కొత్త డాన్స్ మాస్టర్ ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు (Pushpa Producers) స్పష్టం చేసారు. పుష్ప ఫస్ట్ పార్ట్ లో సామీ సామీ’ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు.
ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు..పుష్ప 2 లో అంతకు మించి ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసాడు సుకుమార్. ఆ సాంగ్ కు జానీ ని ఎంపిక చేసాడు. సాంగ్ షూట్ జరిగే క్రమంలో జానీ పై మహిళ కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేయడం, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం , రిమాండ్ కు తరలించడం ఇలా అన్ని కూడా చకచకా జరిగిపోయాయి. ఈ తరుణంలో మేకర్స్ జానీ ప్లేస్ లో మరొకర్ని తీసుకున్నారు.
ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాత నవీన్..తెలిపారు. ఈరోజు పుష్ప 2 రిలీజ్ కు సంబదించిన అధికారిక ప్రకటన చేస్తూ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా సినిమాను డిసెంబర్ 06 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు పేర్కొన్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) మ్యానరిజం, డైలాగ్స్.. ఇవన్నీ ప్యాన్ ఇండియా మాత్రమే కాకుండా ప్యాన్ వరల్డ్‌లో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో అసలు ‘పుష్ప 2’లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరికీ పెరిగింది. ఆసక్తి తగ్గట్లే సినిమాను సుక్కు తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
Read Also : Pushpa 2 Release Date: ఆ రోజే పుష్ప-2 రిలీజ్.. ఫిక్స్ చేసిన నిర్మాతలు!