Deepika Padukone : ప్రభాస్ తర్వాత పుష్ప రాజ్ తో దీపికా.. సౌత్ లో పాగా వేయాలనుకుంటున్న అమ్మడు..!

Deepika Padukone తెలుగు సినిమాలు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడంతో బాలీవుడ్ భామలు కూడా తెలుగు ఆఫర్లను ఓకే అనేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఆఫర్ వచ్చినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే బీ టౌన్

Published By: HashtagU Telugu Desk
Why Deepika Padukone Doesn't Participate Kalki Promotions

Why Deepika Padukone Doesn't Participate Kalki Promotions

Deepika Padukone తెలుగు సినిమాలు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడంతో బాలీవుడ్ భామలు కూడా తెలుగు ఆఫర్లను ఓకే అనేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఆఫర్ వచ్చినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే బీ టౌన్ భామలు ఇప్పుడు ఇక్కడ అవకాశం వస్తే చాలు ఎగిరి గంతేస్తున్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ ఒక స్టార్ సినిమాలో నటిస్తున్న అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వస్తే డబుల్ ధమాకా అన్నట్టు అవుతుంది. లేటెస్ట్ గా అలాంటి ఒక ఛాన్స్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా చెంత చేరిందని తెలుస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దీపికా పదుకొనె అంటే స్పెషల్ క్రేజ్ అని తెలిసిందే. అమ్మడు సినిమాలో ఉంది అంటే చాలు ఆడియన్స్ కి పండుగ అన్నట్ట్టే. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న దీపికా తెలుగులో ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడి సినిమా చేస్తుంది. ఈ సినిమా లో నటించేందుకు గాను 10 నుంచి 15 కోట్ల దాకా దీపికా రెమ్యునరేషన్ గా అందుకుందని టాక్.

కల్కి సినిమా రిలీజ్ అవ్వకుండానే దీపికాకి మరో టాలీవుడ్ బిగ్ ఆఫర్ వచ్చిందని టాక్. ఈసారి పుష్ప రాజ్ సినిమాలో దీపికా నటించే అవకాశం దక్కించుకుందని అంటున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఆ సినిమా లో దీపికా పదుకొనెని హీరోయిన్ గా తీసుకుంటున్నారని టాక్.

త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా అంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఉంది. ఆల్రెడీ హ్యాట్రిక్ సినిమాలతో అదరగొట్టిన ఈ ఇద్దరు కలిసి చేయబోయే నాలుగవ సినిమాలో దీపిక స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. మరి అల్లు అర్జున్ తో దీపిక రొమాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

  Last Updated: 08 Mar 2024, 10:32 AM IST