Jani Master – Pushpa : ఇటీవల జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేసాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వివాదంపై టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే జానీ మాస్టర్ అరెస్ట్ కి పుష్ప సినిమాకు, అల్లు అర్జున్ కి సంబంధం ఉందని పలు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై పుష్ప నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
నేడు మత్తు వదలరా 2 సినిమా సక్సెస్ మీట్ జరగ్గా ఈ సినిమాకు నిర్మాత రవిశంకర్ హాజరయ్యేరు. దీంతో ఓ మీడియా ప్రతినిధి జానీ మాస్టర్ వివాదం, పుష్ప సినిమాకు లింక్ పెడుతున్నారంటూ వచ్చిన వార్తల గురించి ప్రశ్నించారు.
దీనికి పుష్ప నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వచ్చిన సమాచారం బట్టి అది వాళ్ళ వ్యక్తిగత విషయం అని క్లియర్ గా అర్ధమవుతుంది. పుష్ప 2 మొదలైనప్పుడే ఆమెను అడిషినల్ కొరియోగ్రాఫర్ గా తీసుకున్నాం. సినిమాలో అన్ని పాటలకు ఆమె వర్క్ చేసారు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తరవాత ఆ సాంగ్స్ షూట్ ప్లాన్ చేస్తున్నాం. గతంలో మేము రిలీజ్ చేసిన పాటల్లో కూడా ఆమె పేరు ఉంది. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది, దాన్ని జానీ మాస్టర్ తో చేయించాలి అనుకున్నాం. ఇంతలోనే ఇది జరిగింది. వాళ్ళ పర్సనల్ ఇష్యూకి మూవీ టీమ్ కు, హీరోకు ఎలాంటి సంబంధం లేదు. మెయిన్ మీడియా ఎవ్వరూ ఇది రాయలేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సెన్సేషన్ కోసం ఇలాంటి వార్తలు రాస్తున్నాయి. వారి వ్యక్తిగత గొడవలపై మనం కామెంట్ చేయకూడదు అని అన్నారు.
Also Read : Sathyam Sundaram : ‘దేవర’తో కార్తీ పోటీ.. ‘సత్యం సుందరం’ ట్రైలర్ వచ్చేసింది..