Site icon HashtagU Telugu

Devara – Pushpa : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివాదం.. ‘పుష్ప 2’కు అలా జరగనివ్వం..

Pushpa Producer Comments on Devara Pre Release event and Planning about Pushpa Event

Pushpa Devara

Devara – Pushpa : నిన్న ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేయగా ఇచ్చిన పాసుల కంటే కూడా పాసులు లేని ఫ్యాన్స్ అధిక సంఖ్యలో వచ్చి రచ్చ చేసారు. బారికేడ్లు తోసేసి, హోటల్ అద్దాలు పగలకొట్టి, పోలీసులతో గొడవ పడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వచ్చిన సెలబ్రిటీలను కూడా లోపలికి వెళ్లకుండా చేసారు. దీంతో ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫ్యాన్స్ చేసిన రసాభాసాకు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది. దీంతో రాబోయే పెద్ద హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎలా జరుగుతాయి అని ప్రశ్న తలెత్తింది. తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై స్పందిస్తూ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడారు నిర్మాత రవిశంకర్.

పుష్ప నిర్మాత రవిశంకర్ నేడు ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. నిన్న ఈవెంట్లో నన్ను కూడా లోపలికి వెళ్లనివ్వలేదు. ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిపోవడంతో దేవర ఈవెంట్ మళ్ళీ జరగదు. చాలా ఎక్కువమంది ఫ్యాన్స్ వచ్చారు. కంట్రోల్ చేయలేకపోయారు. పుష్ప సినిమాకు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. అవుట్ డోర్ లో ప్లాన్ చేసి ఎక్కువమందికి అరేంజ్మెంట్స్ చేస్తాం, అన్ని ప్రాపర్ గా జరిగేలా చూసుకుంటాం అని క్లారిటీ ఇచ్చారు. దీంతో పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అవుట్ డోర్ లో భారీగా అచేస్తామని క్లారిటీ ఇచ్చేసారు నిర్మాత.

 

Also Read : Jani Master – Pushpa : జానీ మాస్టర్ వివాదం.. స్పందించిన నిర్మాత.. పుష్ప సినిమాకు..