Site icon HashtagU Telugu

Pushpa Russian Trailer: రష్యాలో రిలీజ్ కానున్న ‘పుష్ప’.. ట్రైలర్ ఇదిగో!

Pushpa

Pushpa

‘పుష్ప’ చిత్రం ఇప్పుడు రష్యాలోనూ విడుదల కానుంది. ‘పుష్ప ది రైజ్’ చిత్రం రష్యాలో డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రష్యా భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తుండడం విశేషం. విడుదలకు ముందు డిసెంబరు 1న మాస్కోలో, డిసెంబరు 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో పుష్ప ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మేకర్స్ రష్యన్ భాషలో పుష్ప సినిమా టైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం రష్యన్ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న పుష్ప-1 మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ టాలీవుడ్ లోనే కాకుండా అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి అదిరిపొయే కలెక్షన్లు సాధించింది. ఈ మూవీకి భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్, ఇతర దేశాల్లోనూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ నటన, శ్రీవల్లిగా నటించిన రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు రష్యాలోనూ విడుదల కాబోతుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లే అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version