అల్లు అర్జున్ పుష్ప.. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవర్శీస్ లో కూడా ఒన్ మిలియన్ క్లబో లో ఎంటర్ అయింది. అక్కడ అంచనాల ప్రకారం టూ మిలియన్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యమేం లేదంటున్నారు. నిజానికి సినిమాకు మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చింది. ఆ టాక్ నిజం కూడా. సెకండ్ హాఫ్ అంతా సినిమా పరమ బోరింగ్ గా ఉంటుంది. పైగా ల్యాగ్ కూడా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో ఎంటర్ అయిన ఫహాద్ ఫాజిల్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ తప్ప మిగతా అంతా సోదిలా ఉందనే టాక్ వచ్చింది. పైగా క్లైమాక్స్ లోనే అతని బట్టలు విప్పించిన పుష్పకు ఇక అతన్ని ఫేస్ చేయడం సెకండ్ పార్ట్ లో ఏమంత కష్టం కూడా కాదు అనుకోవచ్చు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పుష్పకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం అదనపు ఆటలు. యస్.. తెలంగాణ ప్రభుత్వం పుష్ప కు ఐదవ ఆటకు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకూ నాలుగు షోస్ కే పరిమితమైన థియేటర్స్ కు మరో షో అదనంగా వేసే అవకాశం రావడంతో పుష్పకు ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయనే నిజం. లేదంటే వంద కోట్ల క్లబ్ లో చేరడానికి మరో రోజు పట్టేది అంటున్నారు. అటు ఆంధ్రలో కూడా హైకోర్ట్ తీర్పు వల్ల టికెట్స్ అన్నీ బ్లాక్ లోనే అమ్మేస్తున్నారు. 100 రూపాయల టికెట్ 250కి పైగా అమ్మేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ అంతే. ప్రేక్షకుడి జేబులు చిల్లులు చేస్తూ 200- 250 రూపాయల వరకూ టికెట్ ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ‘అదనపు దోపిడీ’వల్లే పుష్పకు ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి కానీ.. నిజంగా ఒరిజినల్ రేట్లు వసూలు చేస్తే అది ఇప్పట్లో సాధ్యం కాదు అనుకోవచ్చు.
ఇక ఆదివారం తర్వాత వీక్ డేస్ లో కూడా పుష్ప స్ట్రాంగ్ గా ఉంటే తప్ప బ్రేక్ ఈవెన్ కు రాదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని దాదాపు 250కోట్ల రేషియోలో బిజినెస్ చేశారు. డివైడ్ టాక్ ఉంది. అయినా రెండు రోజుల్లో వంద కోట్లు గ్రాస్ మాత్రమే సాధించింది. అంటే అన్ని ఏరియాలూ సేఫ్ అవ్వాలంటే మరో 180కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేయాలి. కానీ మంగళవారం హాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ సిరీస్ లో ఒకటైన ‘మాట్రిక్స్ రిసరక్షన్’విడుదలవుతోంది. ఆ తర్వాత రెండు రోజులకు బాలీవుడ్ నుంచి ‘83’, టాలీవుడ్ నుంచి శ్యామ్ సింగరాయ్ వస్తున్నాయి. ఈ పోటీని తట్టుకుని ఆ రేంజ్ లో వసూలు చేయడం పుష్పకు అంత సులువేం కాదు. అయినా సాధించాడంటే మాత్రం అదో రికార్డ్ అనుకోవాల్సిందే.
Pushpa: పుష్ప కు కలిసొచ్చిన ఎక్స్ ట్రాస్
