Amul: పుష్ప కార్టూన్స్ వైరల్.. ‘అల్లు టు మల్లు టు అమ్ములు అర్జున్’ అంటూ బన్నీ కామెంట్!

అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ అన్ని వర్గాలవాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నా.. నేటికీ థియేటర్లలో మార్మోగుతూనే ఉంది.

  • Written By:
  • Updated On - January 17, 2022 / 05:14 PM IST

అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ అన్ని వర్గాలవాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నా.. నేటికీ థియేటర్లలో మార్మోగుతూనే ఉంది. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రం నాలుగు వారాలు ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. దేశంలోని ఎంపిక చేసిన థియేటర్లలో పుష్ప రన్ అవుతోంది.

పాల డెయిరీలో అమూల్ సంస్థది ప్రత్యేక స్థానం. సాధారణంగా అమూల్ వ్యాపార ప్రకటనలను గమనిస్తూ చిన్నపిల్లలు కనిపిస్తుంటారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పుష్పరాజ్, శ్రీవల్లి కనిపించారు. ‘పుష్ప ది స్లైస్ పేరుతో అమూల్ హావ్ సమ్ అమ్ములు, అర్జున్’.. అంటూ కార్టూన్ షేర్ చేసింది. క్రియేటివ్ ఆర్ట్ వర్క్ చూసి అల్లు అర్జున్ సైతం ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అల్లు టు మల్లు టు అమ్ములు అర్జున్ అని కామెంట్ చేశాడు. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న పాత్రలను పోలి ఉండే కార్టూన్‌లు చిత్రీకరించబడ్డాయి. అమూల్ టాపికల్ హ్యాష్‌ట్యాగ్ కింద, బ్రాండ్ ట్రెండింగ్ టాపిక్‌లపై కార్టూన్‌లను షేర్ చేస్తుంది. షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాను తుఫానుగా తీసుకుంది.