Site icon HashtagU Telugu

Pushpa Craze in Pakisthan : పాకిస్తాన్ లో పుష్ప క్రేజ్ ఇది.. అక్కడ కూడా ఎవరు తగ్గట్లేదు..!

Pushpa 3 No More Shekhevath in This Part

Pushpa 3 No More Shekhevath in This Part

Pushpa Craze in Pakisthan సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ 1 నేషనల్ వైడ్ గా ట్రెండ్ సృష్టించగా సినిమా వసూళ్లతొ బీభత్సం సృష్టించింది. ఇక సినిమాలోని సాంగ్స్, నీయవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ ఇలా అన్నీ బాగా పాపులర్ అయ్యాయి. భాషతో సంబంధం లేకుండా ఫారిన్ కంట్రీస్ లో కూడా పుష్ప డైలాగ్స్, డాన్స్ మూమెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే పుష్ప కి పాకిస్తాన్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ విషయం లేటెస్ట్ వీడియోతో రివీలైంది.

ఓ తెలుగు యూట్యూబర్ పాకిస్తాన్ వెళ్లగా అక్కడ పుష్ప గురించి అతను అడిగితే.. పుష్ప తగ్గేదేలే అంటూ హిందీలో డైలాగ్ చెప్పాడు ఒక వ్యక్తి. అంతేకాదు గడ్డం కింద చేయి చూపిస్తూ సిగ్నేచర్ కూడా చూపించాడు. ఇక మరో వ్యక్తి చూపే బంగారామాయనే సాంగ్ ని పాడాడు.

తెలుగు సినిమాలకు పాకిస్తాన్ లో ఈ రేంజ్ క్రేజ్ దక్కడం సూపర్ గా అనిపిస్తుంది. సినిమా కు భాషతో సంబంధం లేదు. జస్ట్ ఎమోషన్ కనెక్ట్ అయితే చాలని మరోసారి పుష్ప ప్రూవ్ చేసింది. సో ఈ లెక్కన పుష్ప 2 గురించి పాకిస్తాన్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. పుష్ప 2 ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు.