Site icon HashtagU Telugu

Pushpa 3 : పుష్ప 3 అఫీషియల్ గా చెప్పేసిన అల్లు అర్జున్.. పుష్ప ఫ్రాంచైజ్ కొనసాగుతుంది..!

Is Vijay Devarakonda screening in Pushpa 3

Is Vijay Devarakonda screening in Pushpa 3

Pushpa 3 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారని తెలిసిందే. బెర్లిన్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కు అతిథిగా వెళ్లారు అల్లు అర్జున్. పుష్ప తో పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు మన బన్నీ. పుష్ప రాజ్ హవా దేశ విదేశాలకు పాకింది. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా పుష్ప 2 కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 నే కాదు పుష్ప 3 కూడా ఉంటుందని ఈమధ్య వార్తలు రాగా దాన్ని కన్ ఫర్మ్ చేస్తూ పుష్ప ఫ్రాంచైజ్ కొనసాగుతుందని సర్ ప్రైజ్ చేశాడు అల్లు అర్జున్.

బెర్లిన్ చిత్రోత్సవాల అనంతరం అక్కడ హాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజ్ ను కొనసాగించబోతున్నామని చెప్పారు. పుష్ప 3 డెఫినెట్ గా ఉంటుందని అల్లు అర్జున్ వెల్లడించారు. పుష్ప 2 సినిమా అనుకున్న టైం కు రిలీజ్ చేస్తామని. సినిమా కోసం అందరం బాగా కృషి చేస్తున్నామని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ పుష్ప 3 ఉంటుందని చెప్పి ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్.

ఇంతకీ సుకుమార్ ప్లాన్ ఏంటి ఇదే కథను ఇంకా కొనసాగిస్తారా లేదా పుష్ప 2 తో ఈ కథను ఆపి ఆ క్యారెక్టరైజేషన్ ని కొనసాగింపుగా కొత్త కథలను రాసుకుంటారా.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆగష్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా పుష్ప మేనియాకు ఆడియన్స్ లో ఉన్న బజ్ ని పట్టేసిన సుకుమార్ ఫ్రాంచైజ్ గా దీన్ని కొనసాగించేలా భారీ ప్లానే వేసినట్టు తెలుస్తుంది.

పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా ఈ సినిమా ను అనుకున్న డేట్ కి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్ప 2 తో అల్లు అర్జున్ సుకుమార్ పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నారని అర్ధమవుతుంది.

Also Read : Mrunal Thakur : మృణాల్ కి చెక్ పెడుతున్న అమ్మడు.. ఆల్రెడీ ఒక ఛాన్స్ మిస్..!