Site icon HashtagU Telugu

Pushpa 3 : పుష్ప 3 లో అతను ఉండే ఛాన్స్ లేదా..?

Allu Arjun, Pushpa 2, Sukumar

Allu Arjun, Pushpa 2, Sukumar

సుకుమార్ అల్లు అర్జున్ (Allu Arjun,) కాంబోలో వచ్చిన పుష్ప 1, 2 రెండు సూపర్ హిట్ సినిమాలు కాగా పుష్ప 2 అయితే రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. ఇక పుష్ప 3 (Pushpa 3,) సినిమా కూడా ఉంటుందని ట్విస్ట్ ఇవ్వగా ఈ పార్ట్ లో ఎవరు ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 చివర్లో పెళ్లిలో బాంబ్ బ్లాస్ట్ తో తన ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తారు. పుష్ప రాజ్ ఒక్కడే మిగులుతాడని తెలుస్తుంది.

ఐతే Sukumar పుష్ప 2 లో ఎస్పీ భన్వర్ సింగ్ షెఖావత్ కూడా అవమాన భారంతో ఆ చెక్కల మధ్యలోనే కాలిపోతాడన్నట్టు చూపించారు. కానీ షెకావత్ మృతి చెందడు పోలీసులు అతన్ని కాపాడతారని చెప్పారు. ఐతే పుష్ప 3 లో కూడా షెఖావత్ ఉంటారని అంటున్నారు. కానీ షెఖావత్ ఉండే ఛాన్స్ లేదన్నట్టు తెలుస్తుంది.

పుష్ప 3లో షెఖావత్ ఉండే ఛాన్స్ ఏమాత్రం లేదట. ఫాహద్ ఫాజిల్ కూడా ఆ రోల్ ని ఇంకా కొనసాగించే ఇంట్రెస్ట్ లో లేరట. ఐతే సుకుమార్ ఆ పాత్రని ఇలా క్లోజ్ చేయడం అన్నది ఆడియన్స్ కి నచ్చలేదు. పుష్ప 3 లో కూడా ఆ పాత్రని కొనసాగిత్స్తారా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా పుష్ప 3 పాత్రలతో కూడా సుక్కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నారని చెప్పొచ్చు