ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప ది రూల్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప మేకర్స్ అదిరిపొయే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇవాళ కొద్ది నిమిషాల క్రితమే ఈ మూవీకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో అల్లు అర్జున్ బుల్లెట్ గాయాలతో తిరుపతి జైలుకు నుంచి తప్పించుకుంటున్నట్టు, పోలీసులు పుష్ప జాడ కోసం జల్లెడ పడుతున్నట్టు, వేర్ ఈజ్ పుష్ప అంటూ మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించడం లాంటి ద్రుశ్యాలు ఈ మూవీపై మరింత భారీ అంచనాలు పెంచేస్తున్నాయి.
విడుదల చేసిన కొద్దిసేపటికీ పుష్ప2 గ్లింప్స్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇవాళ రష్మిక బర్త్ డే సందర్భంగా మేకర్స్ శ్రీవల్లీ పోస్టర్ ను విడుదల చేశారు. గ్రామీణ అమ్మాయిగా అందంగా కనిపించింది. అయితే పుష్ప పార్ట్ 1 ఊహించనివిధంగా హిట్ కావడంతో ‘పుష్ప ది రూల్’ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ అప్ డేట్ కోసం అభిమానులు గీతా ఆర్ట్స్ ముందు ధర్నాకు దిగారంటే ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక April 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా నిర్మాతలు ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లు పుష్ప అప్ డేట్ కోసం ఎదురుచూసిన అభిమానులను మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చి ఆశ్చర్యపర్చారు.
ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతినాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టు వార్తలు కూడా వినిపించాయి.
#WhereIsPushpa ?
The search ends soon!The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/LL77Oa3Wt5
— Sukumar Writings (@SukumarWritings) April 5, 2023
