Site icon HashtagU Telugu

Pushpa 2 Trailer Launch : ఈవెంట్లో ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్

Pushpa 2lathicharge

Pushpa 2lathicharge

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (Pushpa 2 Trailer Launch) ఈరోజు సాయంత్రం పాట్నా(Patna)లో గాంధి మైదాన్ లో అట్టహాసంగా జరిగింది. UV మీడియా ఈ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఊహించినదానికంటే ఎక్కువ మంది తరలివచ్చారు. దీంతో గాంధీ స్టేడియం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన పుష్పరాజ్ (Pushparaj) ను చూసేందుకు కొందరు లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన పిల్లర్స్పైకి ఎక్కేశారు.

నార్త్ండియాలో మన తెలుగు హీరోకు ఇంత క్రేజ్ ఉండడం చూసి నార్త్ హీరోలు , సినీ ప్రముఖులుషాక్ అవుతున్నారు. ఇక ఈ ఈవెంట్ కు దాదాపు 2లక్షల మంది వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, వీరిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ట్రైలర్ విడుదలకు ముందు కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ప్రేక్షకులపై లాఠీఛార్జ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ఇక ‘పుష్ప-2’ ట్రైలర్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ‘నేను తొలిసారి బిహార్ కు వచ్చాను. మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. పుష్పరాజ్ ఎప్పుడూ తలవంచడు. కానీ, తొలిసారి మీ అభిమానం ముందు తలవంచుతున్నాడు. నేను మాట్లాడే హిందీలో తప్పులుంటే క్షమించండి. మీరంతా కలిసి ఈ చిత్రాన్ని అతిపెద్దదిగా మార్చారు. బిహార్ పోలీసులకు ధన్య వాదాలు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఈవెంట్​లో పుష్ప ది రూల్ ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ ఈవెంట్​కు హీరో అల్లు అర్జున్- రష్మిక మంధన్నాతో సహా మూవీటీమ్​ హాజరయ్యారు.

ట్రైలర్ విషయానికి వస్తే..

సీక్వెల్​లో పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్​లో ఎదిగిపోయినట్లు చూపించారు. ప్రతి షాట్ ఊర మాస్​గా ఉంది. ఫుల్ పవర్ ప్యాక్డ్​ యాక్షన్ సీన్స్​తో సుకుమార్ సినిమాపై అంచనాలు మరో లెవెల్​కు తీసుకెళ్లారు. బన్నీ డైలాగ్స్, మేనరిజం మరోసారి ట్రెండ్ సెట్ చేయనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షెఖావత్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్​గా ఉంది. ‘పుష్ప అంటే ఫైర్ కాదు- వైల్డ్ ఫైర్’ అనే కొత్త డైలాగ్​తో ఈసారి బన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. ఓవరాల్​గా ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఈ సినిమా పాన్ఇండియా లెవెల్​లో డిసెంబర్ 5న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్​లో డ్యాన్స్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసింది.

Read Also : Deputy CM Bhatti: కూటమిని గెలిపించండి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి: డిప్యూటీ సీఎం భ‌ట్టి