Pushpa 2 Ticket Price : ఏంటీ…పుష్ప 2 సింగిల్ స్ర్కిన్ టికెట్ ధర రూ.300 ?

Pushpa 2 Ticket Price : రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్రసీమ పట్ల సానుకూలంగా ఉండడం..పెద్ద సినిమాలా రిలీజ్ టైం లో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తుండడం తో పుష్ప 2 టికెట్ ధరలను భారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Pushpa-2 Movie Ticket Prices

Pushpa-2 Movie Ticket Prices

రెండు రోజులుగా వరల్డ్ వైడ్ గా పుష్ప మేనియా నడుస్తుంది. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్..పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ ..ఇలా యావత్ సినీ ప్రేక్షకులు పుష్ప డైలాగ్స్ మాట్లాడుకుంటూ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత తో ఉన్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కిన పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. రష్మిక అయితే నేషనల్ క్రాష్ అయిపోయింది. ఇలా ఈ సినిమాలో నటించిన నటీనటులే కాదు సాంకేతిక వర్గం వారు కూడా చాల ఫేమస్ అయ్యారు. ఇక ఇప్పుడు యావత్ సినీ లోకం పుష్ప 2 కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనికి ఉదాహరణే తాజాగా సృష్టించిన ట్రైలర్ వ్యూస్. కేవలం 24 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సినిమా పై ఎంత ఆసక్తి గా ఉన్నారో చెప్పకనే చెప్పారు. ఈ ఎదురుచూపులు మేకర్స్ కాష్ చేసుకోవాలని చూస్తున్నారు. డిసెంబర్ 05 న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో రికార్డు స్థాయి థియేటర్స్ లలో విడుదల కాబోతుంది. అలాగే టికెట్ ధరలను సైతం భారీ గా పెంచబోతున్నట్లు సమాచారం అందుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్రసీమ పట్ల సానుకూలంగా ఉండడం..పెద్ద సినిమాలా రిలీజ్ టైం లో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తుండడం తో పుష్ప 2 టికెట్ ధరలను భారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కూటమి సర్కార్ కల్కి, దేవర సినిమాలకు సింగిల్ స్క్రీన్ రేట్స్ 250 వరకు పెంచింది. ఎక్కువ కలెక్షన్స్‌పై కన్నేసిన పుష్ప మేకర్స్ ఇంకా అదనంగా రేట్లు పెంచుకునే ప్లాన్ చేస్తున్నారట. సింగిల్ స్ర్కిన్ టికెట్ రేట్ 300 రూపాయల దాకా పెంచుకునే వీలు కల్పించాలని కోరుతున్నారట. సింగిల్ స్క్రిన్‌ టికెట్‌ రేటే అంతుంటే మల్టీప్లెక్స్‌లో టికెట్‌ రేట్లు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సినిమాపై బజ్ క్రియేట్ అవ్వటంతో ప్రేక్షకులు తప్పకుండా వస్తారని, టికెట్ రేట్ల గురించి ఆలోచించరంటున్నారు మేకర్స్. మిగతా సినిమాలకు సింగిల్‌ స్క్రీన్ టికెట్‌ రేటు 250కి అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. పుష్ప-2 కోసం 300 రూపాయలకు అనుమతి ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

Read Also : MLA Donthi Madhava Reddy : రేవంత్ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దూరం..కారణం ఏంటి..?

  Last Updated: 19 Nov 2024, 08:39 PM IST