Site icon HashtagU Telugu

Pushpa 2 : తగ్గేదెలే.. పుష్ప-2 ది రూల్ టీజర్.. ఎప్పుడంటే..?

Pushpa2

Pushpa2

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న పుష్ప-2 ది రూల్ (Pushap-2 The Rule) టీజర్ విడుద‌ల విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రపంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్రపంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌. తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో వున్నారు. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

We’re now on WhatsApp. Click to Join.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో.. అల్లుఅర్జున్‌కు సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుండగా.. విలన్‌ పాత్రలో ఫహాద్ ఫాజిల్ (Fahad Fasil) నటిస్తున్నారు. అంతేకాకుండా.. ధనుంజయ్ (Danunjay), సునీల్ (Sunil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) కీలక పాత్రలో నటిస్తున్నారు.
Read Also : Pawan Kalyans : టీడీపీ వాళ్లని చూసి నేర్చుకోండి.. జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ సూచన!