పుష్ప 2 సినిమాకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పుష్ప సినిమాకు అధిక షో లు నిర్వహించుకోవడానికి, టికెట్ ధరలు పెంచుకోవటానికి అవకాశం కల్పిస్తారా లేదా? అనే సందిగ్దత నెలకొంది . కానీ పవన్ కళ్యాణ్ మాత్రం , పుష్ప సినిమాకు గుడ్ న్యూస్ చెప్పారు.
అధిక షో లు నిర్వహించుకోటానికి, టికెట్ రేట్లు పెంచుకునే అంశం పై సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ తో పుష్ప నిర్మాత నవీన్ యెర్నేని మంతనాలు జరిపారు. ఏపీలో పుష్ప టికెట్ రేట్లు పెరుగుతాయా లేదా అంటూ ఇప్పటి దాకా సంధిగ్దత నెలకొంది. ఇప్పటికే తెలంగాణాలో అధిక షోలు వేసుకోడానికి, టికెట్ రేట్లు పెంచుకోడానికి జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సమయం లో ఏపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటదో అని వ్యక్తమవుతున్న తరుణంలో రెండు రోజులుగా విజయవాడలోనే మకాం వేసి పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరిపారు పుష్ప నిర్మాత నవీన్ యెర్నేని.
నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా టికెట్ రేట్లు పెంపు విషయంలో సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు. నిర్మాతల విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి జీవో కూడా విడుదల కానుంది.