Pushpa 2 Song : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నార్త్ లో అయితే ఫుల్ హవా చూపిస్తుంది. పుష్ప 1 లో సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఊ అంటావా ఊ ఊ అంటావా అని సమంత అదరగొట్టింది.
ఇప్పుడు పుష్ప 2 లో శ్రీలీల చేసింది. తాజాగా పుష్ప 2 నుంచి ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. కిస్ కిస్ కిసిక్ అని సాగే ఈ సాంగ్ ని చంద్రబోస్ రాయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో శుభలాషిని పాడింది. తాజాగా లిరికల్ సాంగ్ విడుదల చేసారు. ఇందులో శ్రీలీల, అల్లు అర్జున్ చేసిన ఓ స్టెప్ కూడా చూపించారు. అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరూ బెస్ట్ డ్యాన్సర్లు అని తెలిసిందే. మరి ఈ పాటలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఏ రేంజ్ లో వేసారో తెరపై చూడాల్సిందే. శ్రీలీల తన హాట్ హాట్ అందాలతో కూడా అలరించినట్టు తెలుస్తుంది.
మీరు కూడా పుష్ప 2 శ్రీలీల స్పెషల్ సాంగ్ చూసేయండి..
Also Read : IPL Auction Record: పంత్, అయ్యర్ లకు జాక్ పాట్.. ఐపీఎల్ వేలం విశేషాలీవే!