Site icon HashtagU Telugu

Pushpa 2 Special Song : ఆ ఇద్దరిలో పుష్ప రాజ్ ఓటు ఎవరికి..?

Pushpa 2 Special Song Allu Arjun Sukumar Planing

Pushpa 2 Special Song Allu Arjun Sukumar Planing

Pushpa 2 Special Song అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా అనుకున్న టైం కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా లో స్పెషల్ ఐటం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.

పుష్ప 1 లో సమంత చేసిన ఉ అంటావా సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. దేవి ఇచ్చిన ట్యూన్ కి సమంత చేసిన గ్లామర్ షోకి బాగా సెట్ అయ్యింది. సమంత చేయకపోతే ఆ సాంగ్ అంత హిట్ అయ్యేది కాదేమో. ఇక పుష్ప 2 లో కూడా దానికి మించే సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సాంగ్ కోసం ఈసారి బాలీవుడ్ భామలను దించే ప్లానింగ్ లో ఉన్నాడు సుకుమార్.

ఊర్వశి రౌతెలా పేరు చరల్లో ఉండగా లేటెస్ట్ గా మరో ఇద్దరి పేర్లు లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ అందాల భామలు దిశా పటాని, కృతి సనన్ ఇద్దరిలో ఒకరిని తీసుకోవాలని అనుకుంటున్నారట. దిశా పటాని అయితే బాగానే ఉంటుందని అనుకుంటుండగా ఆల్రెడీ ఆమె ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేసింది. అందుకే కృతి అయితే ఎలా ఉంటుందని చూస్తున్నారట. మొత్తానికి పుష్ప 2 ఐటం సాంగ్ లో ఈ ఇద్దరిలో ఒకరు ఫిక్స్ అని తెలుస్తుంది.